Mamata Banerjee : దేశం కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్దం
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
Mamata Banerjee : టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల కోసం అవసరమైతే తన ప్రాణాలను ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. ఈద్ పండగ సందర్భంగా భారతీయ జనతా పార్టీపై ఆమె నిప్పులు చెరిగారు.
కొందరు దేశాన్ని మతం పేరుతో విభజించాలని చూస్తున్నారంటూ పరోక్షంగా సంచలన ఆరోపణలు చేశారు. ఈ దేశం కోసం నేనే కాదు నాతో పాటు కార్యకర్తలు సైతం ప్రాణాలు అర్పించేందుకు, త్యాగం చేసేందుకు సంసిద్దులమై ఉన్నామని ప్రకటించారు మమతా బెనర్జీ(Mamata Banerjee).
కొందరు కావాలని ఈ దేశంలో మతం పేరుతో, కులం పేరుతో, విద్వేషాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పశ్చిమ బెంగాల్ లో తాను బతికి ఉన్నంత వరకు సాగనీయబోనంటూ హెచ్చరించారు సీఎం. దేశ విభజనను ఒప్పుకునే పరిస్థితి లేదన్నారు. కోల్ కతా నగరంలోని రెడ్ రోడ్ లో జరిగిన ఈద్ నమాజ్ లో జరిగిన సభలో మమతా బెనర్జీ ప్రసంగించారు.
ప్రజలు ఏకం కావాలని మితవాద భారతీయ జనతా పార్టీని 2024 ఎన్నికలలో ఓడించాలని పిలుపునిచ్చారు సీఎం. కాషాయ శిబిరం దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లో తాను ఎన్ఆర్సీ అమలును అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
Also Read : 36 గంటలు 8 నగరాలు 5,300 కిలోమీటర్లు