AI Effect : కొలువులపై కృత్రిమ మేధస్సు ప్రభావం
62 శాతం మంది అమెరికన్ల అభిప్రాయం
AI Effect : టెక్నాలజీలో వరల్డ్ వైడ్ గా చోటు చేసుకున్నపరిణామాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఎప్పుడైతే చాట్ జీపీటీ వచ్చిందో టెక్ దిగ్గజం గూగుల్ సైతం ఆందోళన చెందుతోంది. తాజాగా అమెరికాలో చేపట్టిన సర్వేలో 62 శాతం మంది అమెరికన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI Effect) (ఏఐ) ఉద్యోగాలపై ప్రభావం చూపుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే రోజులలో ఏఐతో పాటు మెషీన్ లెర్నింగ్ , సైబర్ సెక్యూరిటీ కూడా తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
ఓపెన్ ఏఐకి చెందిన చాప్ జీపీటీ, ఇతర కృత్రిమ మేధస్సు (ఏఐ) మోడళ్లకు పెరుగుతన్న ప్రజాదరణ మానవ నిపుణులను భర్తీ చేసే సామర్థ్యాలపై ఆందోళనలకు దారి తీసింది. చాలా మటుకు ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులలో ఎక్కువ శాతం తమపై ఏఐ ఎఫెక్ట్ చూపనుందని భావిస్తున్నారు.
అయితే ఇన్ఫోసిస్ కో ఫౌండర్ ఎన్ ఆర్ నారాయణ మూర్తితో సహా అనేక మంది టెక్ దిగ్గజాలు ఈ భావనను తోసిపుచ్చారు. చాట్ జిపిటి అనేది మానవ మేధస్సును ఎప్పటికీ భర్తీ చేయలేదని కొట్టి పారేశారు. అయితే అమెరికాకు చెందిన వ్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం 71 శాతం అమెరికన్ పౌరులు తుది నియామక నిర్ణయాలు తీసుకోవడంలో ఏఐని ఉపయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Also Read : భారత దేశంలో మీడియా సూపర్ – లూ