Jagadish Shettar : లింగాయత్ ప్రచారాన్ని ప్రజలు నమ్మరు
కర్టాటక మాజీ సీఎం జగదీశ్ షెట్టర్
Jagadish Shettar : కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ షెట్టర్(Jagadish Shettar) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన తాజాగా బీజేపీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. బీజేపీ చేస్తున్న లింగాయత్ ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు.
రాష్ట్రంలో మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీని వీడారు. లింగాయత్ బీజేపీ సీనియర్ నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని జోష్యం చెప్పారు. కర్ణాటక లోని హుబ్బళ్లి లో ఆయన పర్యటించారు. బీజేపీ తన ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసిందన్నారు.
అలాంటి పార్టీకి రాష్ట్రానికి చెందిన ప్రజలు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు మాజీ సీఎం. చాలా మంది సీనియర్ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు బీజేపీకి దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. నా ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీయడం అంటే ఈ ప్రాంత ప్రజలను దెబ్బ తీయడమేనని అన్నారు జగదీశ్ షెట్టర్.
ఇది బీజేపీ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రజలు ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని హెచ్చరించారు. లింగాయత్ సీఎం ప్రచారానికి బీజేపీ ప్లాన్ చేయడంపై మండిపడ్డారు. అది ఆ పార్టీకి అనుకూలం కాదన్నారు. వారి ప్రకటనలను ప్రజలు నమ్మ బోరన్నారు.
ఇప్పుడే ఎందుకు ప్రారంభించారు. ఇంతకు ముందు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు మాజీ సీఎం. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే బీజేపీ చేస్తోందన్నారు. లింగాయ్ సీఎంగా ప్రకటించినా ప్రజలు ప్రచారాన్ని నమ్మబోరని స్పష్టం చేశారు జగదీశ్ షెట్టర్(Jagadish Shettar).
Also Read : పంజాబ్ సర్కార్ కు అమిత్ షా కితాబు