IPL 2023 Captains Fine : ఆ కెప్టెన్లకు ఐపీఎల్ రూల్స్ బెడద
నిషేధం అంచున ఆ ఐదుగురు
IPL 2023 Captains Fine : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 16వ సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తాజాగా ప్లే ఆఫ్స్ , క్వాలిఫయర్స్ , ఫైనల్ మ్యాచ్ లకు సంబంధించి షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఇక ఇప్పటి దాకా అన్ని జట్లు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడుతున్నాయి. ప్రస్తుతానికి రాజస్థాన్ , లక్నో, చెన్నై, గుజరాత్ జట్లు పాయింట్ల పట్టికలో దోబూచు లాడుతున్నాయి.
ఇదిలా ఉండగా లీగ్ లో భాగంగా బీసీసీఐ – ఐపీఎల్ క్రమ శిక్షణ కమిటీ తీసుకుంటున్న నిర్ణయాలు, చేపట్టిన రూల్స్ ఇప్పుడు ఐపీఎల్ లో ఆడుతున్న ఆయా జట్లకు, కెప్టెన్లకు తలనొప్పిగా మారాయి. విచిత్రం ఏమిటంటే స్లో ఓవర్ రేట్ కారణంగా స్కిప్పర్లకు(IPL 2023 Captains Fine) రూ. 12 లక్షల చొప్పున ఫైన్ వేసింది క్రమశిక్షణ కమిటీ.
మరో వైపు ముంబై ఇండియన్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన కీలక పోరులో నితీశ్ రాణా, సూర్య కుమార్ యాదవ్ ల మధ్య మాటల యుద్దంపై సీరియస్ అయ్యింది. ఆ ఇద్దరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంతే కాదు మ్యాచ్ ఫీజులో కోత విధించింది.
ఇక మరో కీలకమైన అంశం ఏమిటంటే ఇప్పటి దాకా ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ , లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ , గుజరాత్ టైటాన్స్ లీడర్ హార్దిక్ పాండ్యా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కిప్పర్ ఫాఫ్ డు ప్లెసిస్ , ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ బదులు కెప్టెన్ గా వ్యవహరించిన సూర్య కుమార్ యాదవ్ పై జరిమానా విధించారు.
స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక్కొక్కరికీ రూ. 12 లక్షల ఫైన్ పడింది. మరోసారి గనుక ఇలాగే చేస్తే రూ. 24 లక్షలు విధిస్తుంది. అంతే కాదు తిరిగి రిపీట్ అయితే కెప్టెన్ పై ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తుంది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిటీ.
Also Read : ముంబై జోరుకు పంజాబ్ బ్రేక్ వేసేనా