Basavanna Quotes : బ‌స‌వ‌న్న బోధ‌న‌లు అనుస‌ర‌ణీయాలు

రాజ‌నీతిజ్ఞుడు..క‌విరేణ్యుడు..సంఘ సంస్క‌ర్త‌

Basavanna Quotes : క‌ర్ణాట‌క రాష్ట్రంలో 12వ శ‌తాబ్దానికి చెందిన సంఘ సంస్క‌ర్త బ‌సవేశ్వ‌రుడు లేదా బ‌స‌వ‌న్న జ‌యంతి ఇవాళ‌. ఆయ‌న ఇవాళ భౌతికంగా లేక పోయినా నేటికీ ఆద‌ర్శ ప్రాయంగా నిలుస్తున్నారు. త‌న జీవిత కాలంలో రాసిన రాత‌లు , ఆలోచ‌న‌లు స్పూర్తి దాయ‌కంగా నిలుస్తున్నాయి. త‌త్వ‌వేత్త‌, క‌వి , భ‌క్తి ఉద్య‌మానికి ఊపిరి పోసిన ఆధ్యాత్మిక వేత్త‌. త‌న క‌విత్వం ద్వారా సామాజిక అవ‌గాహ‌న‌ను వ్యాపింప చేశాడు.

లింగ వివ‌క్ష‌ను నిర‌సించాడు. సామాజిక వివ‌క్ష‌ను త‌ప్పు ప‌ట్టాడు. ప్ర‌తి ఒక్క‌రికి బ‌తికే హ‌క్కు ఉంద‌న్నాడు. మూఢ న‌మ్మ‌కాల‌ను, ఆచారాల‌ను తిర‌స్క‌రించాడు. త‌న పాల‌న‌లో ఎన్నో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టాడు. లింగాయ‌త్ ల స్థాప‌కుడిగా గుర్తింపు పొందాడు. పాల‌నా ప‌రంగా ఆద‌ర్శ ప్రాయంగా నిలిచాడు. పాల్కురికి సోమ‌నాథుడు బ‌స‌వేశ్వ‌రుడి(Basavanna Quotes) గురించి రాశాడు.

నా కంటే త‌క్కువ ఎవ‌రూ లేరు అనే భావ‌న‌తో ప‌ని చేయండి. శ‌ర‌ణాల స‌మాజాన్ని మించిన‌ది ఏదీ లేదు అని పేర్కొన్నారు బ‌స‌వ‌న్న‌. నైతికంగా జీవించు. ఇత‌రుల సంప‌ద‌ను, స్త్రీల‌ను , భ‌గ‌వంతుడిని ఆశించ వ‌ద్దు. మార్గాన్ని అనుస‌రించేట‌ప్పుడు హృద‌యాన్ని కోల్పోవ‌ద్దు. విశ్వాసంతో కూడిన సూత్ర‌ప్రాయ‌మైన జీవితాన్ని గ‌డ‌పండి అని పిలుపునిచ్చాడు. విశ్వం సృష్టి వెనుక స‌ర్వోన్న‌త శ‌క్తి ఉంద‌న్న‌ది గుర్తించాలి.

ధ‌న‌వంతులు శివునికి ఆల‌యాలు క‌ట్టిస్తారు. కానీ నేను పేద‌వాడిని. నా కాళ్లు స్తంభాలు, శ‌రీరం పూజా మంద‌రిం. నిల‌బ‌డి ఉన్న వ‌స్తువులు ప‌డి పోతాయి. క‌దిలేవి అలాగే ఉంటాయ‌ని పేర్కొన్నాడు. ప్ర‌తి వ్య‌క్తి దేవునితో లేదా విధితో ప్ర‌త్య‌క్ష సంబంధం క‌లిగి ఉంటాడని, ఎవ‌రి మ‌ధ్య వ‌ర్తిత్వం అవ‌స‌రం లేద‌ని బోధించాడు. దొంగ‌త‌నం చేయొద్దు. చంప‌కూడ‌దు. అబ‌ద్దాలు చెప్ప‌కండి. ఎవ‌రితోనూ కోపంగా ఉండ‌కండి. మ‌రొక‌రిని దూషించ‌కండి అని పిలుపునిచ్చారు.

మీ జీవితాన్నినిజాయితీగా నిర్వ‌హించండి. ఇత‌రుల సంప‌ద‌, స్త్రీలు లేదా దేవుణ్ణి కూడా కోరుకోవ‌ద్ద‌ని హెచ్చ‌రించాడు. దొంగ‌ల‌కు భ‌య‌ప‌డి ప్ర‌జ‌లు పాతిపెట్టే దేవుళ్ల‌తో , అవ‌స‌ర‌మైన‌ప్పుడు అమ్ముకునే దేవుళ్ల‌ను నేను ఎలా ఒకేలా ఉండాల‌ని అనుకోవాల‌ని ప్ర‌శ్నించాడు.

చిత్త‌శుద్దితో , నిజాయితీతో కూడిన శ్ర‌మ ద్వారా ఆర్థిక విజ‌యాన్ని పొందండి. మీరు ప‌ని చేస్తున్న‌ప్పుడు మీ కంటే త‌క్కువ ఎవ‌రూ లేర‌ని, మీరు ప‌ని చేస్తున్న‌ప్పుడు స‌మాజాన్ని మించిన వారు లేర‌ని భావించాల‌ని సూచించాడు బ‌సవేశ్వ‌రుడు. మీకు అవ‌స‌ర‌మైనంత మేర‌కే తినండి. మిగిలిన వాటిని ఇత‌రుల‌కు పంచండి.

ఆ అవ‌స‌రం ఉన్న వారు చాలా మంది వేచి ఉన్నార‌ని గుర్తించండి. ఎవ‌రైనా మీపై న‌మ్మ‌కాన్ని కోల్పోయేలా చేసే ప‌నిని ఎప్పుడూ చేయ‌కండి. జ్ఞానం బ‌లం అజ్ఞానం బ‌ల‌హీన‌త‌పై విజ‌యం సాధిస్తుంది. కాంతి స‌మ‌ర్థ‌త చీక‌టిని దూరం చేస్తుంది.

Also Read : సంఘ సంస్క‌ర్త స్పూర్తి ప్ర‌దాత

Leave A Reply

Your Email Id will not be published!