Siddaramaiah Bommai : బొమ్మైపై భగ్గుమన్న సిద్దరామయ్య
లింగాయత్ సీఎం అవినీతికి కేరాఫ్
Siddaramaiah Bommai : కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య సంచలన కామెంట్స్ చేశారు. మే 10న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 13న పోలింగ్ ఫలితాలు వెల్లడి అవుతాయి. ఈ సందర్బంగా బీజేపీ ఎన్నికల ప్రచారంగా లింగాయత్ కమ్యూనిటీకి చెందిన నాయకుడికే సీఎం పదవి కట్టబెడుతామని ప్రకటించింది. దీనిపై సీరియస్ గా స్పందించారు మాజీ సీఎం(Siddaramaiah). ఇప్పటికే లింగాయత్ కు చెందిన వ్యక్తి బస్వరాజ్ బొమ్మై సీఎంగా ఉన్నారని ఇంకొకరిని చేస్తామని బీజేపీ అబద్దాలు ఎలా చెబుతుందంటూ ప్రశ్నించారు.
మాజీ సీఎం సిద్దరామయ్య ఆదివారం మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనంతగా అవినీతి, అక్రమాలకు బొమ్మై సీఎంగా(Bommai) వచ్చాక పెరిగిందని ఆరోపించారు. ఇలాంటి సీఎం ఉండడం వల్ల రాష్ట్రానికి ప్రమాదమని హెచ్చరించారు. తాను లింగాయత్ సామాజిక వర్గాన్ని విమర్శించ లేదన్నారు. కానీ కేవలం ఇదే సామాజిక వర్గానికి చెందిన బొమ్మైని టార్గెట్ చేశానని చెప్పారు. దీనిని తప్పుగా ప్రచారం చేస్తున్న వారు తన మాటలను వక్రీకరించారని ఆవేదన చెందారు.
తాను బొమ్మైని మాత్రమే విమర్శించానని చెప్పారు సిద్దరామయ్య(Siddaramaiah). ఇదిలా ఉండగా మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై. మాజీ సీఎం గతంలో నోరు జారారు. ప్రస్తుతం లింగాయత్ సామాజిక వర్గాన్ని మొత్తం అవమానానికి గురి చేశారని ఆరోపించారు. గతంలో బ్రాహ్మణ సమాజాన్ని అవహేళన చేశారని, తాజాగా లింగాయత్ ల గురించి చులకన చేసి మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు.
Also Read : ఆస్పత్రిలో చేరిన కుమారస్వామి