Chandrababu Naidu : ష‌ర్మిల ఖండించినా నోరు మెద‌ప‌ని జ‌గ‌న్

వివేకా హ‌త్య కేసుపై బాబు కామెంట్స్

Chandrababu Naidu : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల త‌న బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసుపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆస్తి కోసం ఆయ‌న‌ను హ‌త్య చేయ‌లేద‌న్నారు. ఆనాడే బాబాయి మొత్తం ఆస్తుల‌ను చెల్లెలు వైఎస్ సునీత పేరుపై రాశార‌ని స్ప‌ష్టం చేశారు.

ఒక‌వేళ హ‌త్య గ‌నుక చేస్తే ముందు వివేకా కంటే సునీతను చంపాల‌న్నారు. ప్ర‌స్తుతం ష‌ర్మిల చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu).

చెల్లెలు చేసిన కామెంట్స్ పై ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి స్పందించాల‌ని డిమాండ్ చేశారు. ఇప్ప‌టి దాకా వివేకా హ‌త్య‌పై ఎందుకు మౌనం వహించారంటూ నిల‌దీశారు. ఇదేం క‌ర్మ కార్య‌క్రమంలో భాగంగా ప‌ల్నాడు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలో చంద్ర‌బాబు నాయుడు రోడ్ షో చేప‌ట్టారు. ఏపీ సీఎం త‌న‌పై కావాల‌ని దుష్ప్ర‌చారం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు ఈ పాల‌న‌ను త‌ట్టుకోలేక పోతున్నార‌ని అన్నారు. మార్పు కోరుకుంటున్నార‌ని , జ‌గ‌న్ ను భ‌రించే స్థితిలో లేరన్నారు చంద్ర‌బాబు నాయుడు.

ఇదే స‌మ‌యంలో నీటి పారుద‌ల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబుపై సెటైర్ వేశారు టీడీపీ చీఫ్‌. ఆయ‌న నీటి పారుద‌ల‌పై ప‌ట్టు లేద‌న్నారు. ఇలాంటి వ్య‌క్తికి మంత్రి ప‌ద‌వి ఎలా ఇస్తారంటూ ప్ర‌శ్నించారు. నోరుంటే స‌రిపోతుందా ప‌ని చేయ‌క్క‌ర్లేదా అని నిల‌దీశారు చంద్ర‌బాబు నాయుడు.

Also Read : కొలువుల కోసం ఆగ‌దు పోరాటం

Leave A Reply

Your Email Id will not be published!