Shivam Dube : శివ‌మ్ శివ‌మెత్తినా త‌ప్ప‌ని ఓట‌మి

ఫ‌లించ‌ని బ్యాట‌ర్ ప్ర‌య‌త్నం

Shivam Dube : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ధోనీ సేన టార్గెట్ ను ఛేదించ లేక చ‌తికిల ప‌డింది. రాజ‌స్థాన్ లోని స‌వాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జ‌రిగిన కీల‌క పోరులో మ‌రోసారి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆధిప‌త్యం చెలాయించింది. కెప్టెన్ సంజూ శాంస‌న్(Sanju Samson) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాజ‌స్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 202 ర‌న్స్ చేసింది.

అనంత‌రం 203 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆశించిన మేర రాణించ లేక పోయింది. ప్ర‌ధానంగా రాజ‌స్థాన్ బౌల‌ర్ ఆడం జంపా బౌలింగ్ దెబ్బ‌కు చెన్నై బ్యాట‌ర్లు ఆడ‌లేక వికెట్లు స‌మర్పించుకున్నారు. 4 ఓవ‌ర్లు వేసిన జంపా 22 ర‌న్స్ మాత్ర‌మే ఇచ్చి 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఇదిలా ఉండ‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టులో వ‌రుస‌గా మ‌రోసారి శివ‌మ్ దూబే(Shivam Dube) మెరిసినా లాభం లేక పోయింది. 33 బంతులు ఆడి 2 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 52 ర‌న్స్ తో హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఈసారి ఐపీఎల్ సీజ‌న్ లో దూబే నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. జ‌ట్టు స్కోర్ లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మొత్తంగా శివ‌మ్ దూబే రాణించినా చివ‌రి దాకా పోరాడినా చెన్నై సూప‌ర్ కింగ్స్ ను గ‌ట్టెక్కించ లేక పోయాడు.

దీంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బౌల‌ర్ల ధాటికి సీఎస్కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 170 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. 32 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యాన్ని చ‌వి చూసింది. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో నుంచి మూడో స్థానంలోకి ప‌డి పోయింది సీఎస్కే.

Also Read : ఆడం జంపా మ్యాజిక్ చెన్నై షాక్

Leave A Reply

Your Email Id will not be published!