Supreme Court : రెజ్లర్ల ఆందోళనపై సుప్రీం విచారణ
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ పై ఫైర్
Supreme Court : దేశ రాజధాని ఢిల్లీలో తమ నిరసనను పునరుద్దరించిన రెజ్లింగ్ బాడీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు తమకు న్యాయం చేయాలంటూ సుప్రీంకోర్టు(Supreme Court) మెట్లు ఎక్కారు. శుక్రవారం ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తమను లైంగికంగా వేధింపులు గురి చేశాడంటూ రెజ్లర్లు సంచలన ఆరోపణలు చేశారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ మహిళా రెజ్లర్లు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. వాళ్లు కేసు నమోదు చేయక పోవడాన్ని తప్పు పట్టారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. కేసును విచారించిన ధర్మాసనం ఎందుకు కేసు నమోదు చేయలేదంటూ ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
అంతర్జాతీయ క్రీడలలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన రెజ్లర్లు లైంగిక వేధింపుల గురించి పిటిషన్ లో తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని ఈ కోర్టు పరిగణలోకి తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.
బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేసేంత వరకు తాము ఆందోళన విరమించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్ , వినేష్ ఫోగట్ , బజరంగ్ పునియా .అయితే రెజ్లర్లు చేసిన ఆరోపణలలో నిజం లేదన్నాడు డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజజ్ భూషణ్ శరణ్ సింగ్.
Also Read : దేశంలో 7,533 కొత్త కేసులు 44 మరణాలు