MP Afzal Ansari : ఎంపీ అఫ్జ‌ల్ అన్సారీపై అన‌ర్హ‌త వేటు

రాహుల్ గాంధీ త‌ర్వాత మ‌రొక‌రు

MP Afzal Ansari : దేశ రాజ‌కీయాల‌లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. న‌రేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేసులో సూర‌త్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై. ఆయ‌న దీనిని స‌వాల్ చేస్తూ గుజ‌రాత్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇదిలా ఉండ‌గా తాజాగా మ‌రో ఎంపీ అఫ్జ‌ల్ అన్సారీపై(MP Afzal Ansari) కూడా అన‌ర్హ‌త వేటు ప‌డింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే కృష్ణా నంద్ రాయ్ హ‌త్య‌కు సంబంధించిన కిడ్నాప్ , హ‌త్య కేసులో నిందితులుగా ఉన్నారు అన్సారీ సోద‌రులు.

గ్యాంగ్ స్ట‌ర్ గా మారిన రాజ‌కీయ నాయ‌కుడు ముఖ్తార్ అన్సారీ దోషిగా తేల్చింది కోర్టు. 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది యూపీ లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు. కొన్ని గంట‌ల త‌ర్వాత ఆయ‌న సోద‌రుడు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ ఎంపీ అఫ్జ‌ల్ అన్సారీని కూడా దోషిగా నిర్దారించారు. అదే కేసులో నాలుగు సంవ‌త్స‌రాల జైలు శిక్ష ప‌డింది. రాయ్ హ‌త్య కేసులో ముఖ్తార్ అన్సారీ, అఫ్జ‌ల్ అన్సారీ దోషులుగా ఉన్నారు.

దీంతో అఫ్జ‌ల్ అన్సారీ(MP Afzal Ansari) ఎంపీ ప‌ద‌వికి ఎస‌రు వ‌చ్చి ప‌డింది. దీంతో ఆయ‌న త‌న లోక్ స‌భ స‌భ్య‌త్వాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింది. పార్ల‌మెంట్ రూల్స్ ప్ర‌కారం రెండు సంవ‌త్స‌రాలు లేదా అంత‌కంటే ఎక్కువ జైలు శిక్ష విధిస్తే వెంట‌నే ఎంపీ లోక్ స‌భ స‌భ్య‌త్వాన్ని కోల్పోతారు. ఇదిలా ఉండ‌గా దివంగ‌త బీజేపీ ఎమ్మెల్యే రాయ్ భార్య యూపీలో మాఫియా పాల‌న అంత‌మైంద‌ని అన్నారు. త‌న‌కు న్యాయ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం ఉంద‌న్నారు.

Also Read : కుట్ర నిజం మోసం అవాస్త‌వం

Leave A Reply

Your Email Id will not be published!