Arvind Kejriwal : మహిళా రెజ్లర్లకు మద్దతివ్వండి
పిలుపునిచ్చిన సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన మహిళా రెజ్లర్లకు మద్దతు ప్రకటించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్నామని, తమకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరుతూ మహిళా రెజ్లర్లు రోడ్డెక్కడం దారుణమన్నారు సీఎం. ఇది తనను బాధకు గురి చేస్తోందన్నారు.
న్యాయ బద్దంగా ఆందోళన చేపట్టిన మహిళా రెజ్లర్లకు ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు అరవింద్ కేజ్రీవాల్. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటేనే కానీ ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయలేదని ధ్వజమెత్తారు.
ఇవాళ దేశం ఎక్కడికి పోతోందో అర్థం కావడం లేదన్నారు. ఈ దేశంలో ప్రభుత్వం అనేది ఉందా అని ప్రశ్నించారు. సీజేఐ చంద్రచూడ్ సీరియస్ కామెంట్స్ చేశారు. దేశం కోసం ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా రెజ్లర్లకు రక్షణ లేక పోతే ఎలా అని ప్రశ్నించారని ఇది ప్రభుత్వ పనితీరును తెలియ చేస్తోందన్నారు కేజ్రీవాల్(Arvind Kejriwal).
అంతర్జాతీయ వేదికలపై అథ్లెట్లు భారత దేశం గర్వపడేలా చేశారని కానీ గత వారం రోజులుగా ఆందోళన చేపడుతున్నా ఎందుకు స్పందించడం లేదని, బీజేపీ ఎంపీపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ నిలదీశారు.
Also Read : నా ఇష్టం నేనే సుప్రీం