Whats App Bans : వాట్సాప్ షాక్ 47 ల‌క్ష‌ల ఖాతాలు క్లోజ్

నిషేధం విధించిన దిగ్గ‌జ సంస్థ

Whats App Bans : వాట్సాప్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి లో భార‌త దేశంలో 47 ల‌క్ష‌ల ఖాతాల‌ను నిషేధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన ఫిర్యాదుల ఆధారంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మోదీ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. అభ్యంత‌ర క‌ర‌మైన లేదా వివాదాస్ప‌ద‌మైన యూజ‌ర్ల ఖాతాల‌పై ఫోక‌స్ పెట్టింది వాట్సాప్.

ఈ మేర‌కు ఫిర్యాదుల ఛానెల్ ద్వారా అందిన ఫిర్యాదుల మేర‌కు ఈ షాకింగ్ నిర్ణ‌యం తీసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇప్ప‌టికే ఫ్యాక్ట్ చెకింగ్ విధానాన్ని ప్ర‌వేశ పెట్టింది కేంద్రం. దీంతో ఏ మాత్రం అనుమానం వ‌చ్చినా వెంట‌నే దానిని బ్లాక్ లిస్టులో పెట్టేస్తోంది వాట్సాప్.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాకు సంబంధించి +91 ఫోన్ నంబ‌ర్ ద్వారా వాట్సాప్ యూజ‌ర్ల‌ను గుర్తించే ప‌నిలో ప‌డింది. ఎవ‌రెవ‌రు ఏమేం వాడుతున్నారు. ఎలాంటి న్యూస్, ఫోటోలు, అంశాల‌ను షేర్ చేస్తున్నార‌నే దానిపై ఫోక‌స్ పెట్టింది వాట్సాప్.

ఒక్క మార్చి నెల‌లోనే దాదాపు 4.7 మిలియ‌న్ వాట్సాప్ ఖాతాలపై (Whats App Bans) వేటు వేసింది వాట్సాప్. వాటిలో 1.7 మిలియ‌న్ ఖాతాలు యూజ‌ర్ల నుండి ఎటువంటి నివేదిక‌లు రాక ముందే ముంద‌స్తుగా నిషేధానికి గుర‌య్యాయి. ఈ విష‌యాన్ని ఇన్ స్టంట్ మెసేజింగ్ ప్లాట్ ఫాం త‌న నెల‌వారీ నివేదిక‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

Also Read : కోహ్లీ కిస్ అనుష్క జోష్

Leave A Reply

Your Email Id will not be published!