TTD EO : 13న తిరుమలలో సామూహిక శ్రమదానం
పర్యావరణ రహిత పుణ్యక్షేత్రం లక్ష్యం
TTD EO : తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మారెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వేసవి కాలం కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులను ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా టీటీడీ ఉద్యోగులు స్వచ్ఛంధంగా శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది సక్సెస్ కావడంతో మే 13న సామూహిక శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
తిరుమలను ప్లాస్టిక్ రహిత పుణ్య క్షేత్రంగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా సులభ్ కాంప్లెక్స్ కార్మికులు సమ్మెకు దిగడంతో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అసౌకర్యం ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈవోనే రంగంలోకి దిగడం విశేషం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు టీటీడీ(TTD EO) ఉద్యోగులు పాలు పంచుకోవడం పట్ల ధన్యవాదాలు తెలిపారు ఈవో ఏవీ ధర్మారెడ్డి.
గత రెండు రోజులుగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఇదే స్పూర్తితో తిరుమల లోని ఘాట్ రోడ్లు, నడక మార్గాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేయి మంది ఉద్యోగులు ఇందులో పాల్గొంటారని తెలిపారు. శ్రమదాన యజ్ఞానికి దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ లభించిందని పేర్కొన్నారు ఏవీ ధర్మారెడ్డి(TTD EO).
Also Read : దేశంలో 3,325 కేసులు 17 మరణాలు