RK Roja Selvamani : గంగమ్మ తల్లి సేవలో ఆర్కే రోజా
పూజలు చేసిన రాష్ట్ర మంత్రి
RK Roja Selvamani : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి తిరుపతి లోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘనంగా పూజలు చేశారు. భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లి మహాకుంభాభిషేకం మహోత్సవాలు కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా జరిగిన పుష్పాధివాసం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గంగమ్మ తల్లికి అన్ని రకాల పుష్పాలతో పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీతాతయ్య గుంట గంగమ్మ దేవాలయం ధర్మకర్తల మండలి పాలక మండలి, ఆలయ కార్యనిర్వహణ అధికారులు, అర్చకులు, పూజారులు మంత్రి ఆర్కే రోజా సెల్వమణికి ఘన స్వాగతం పలికారు. వేద మంత్రాలతో అమ్మ వారికి పూజలు జరిపించారు. మంత్రిని ఆశీర్వదించారు.
అమ్మ వారికి పూజలు చేసిన మంత్రి ఆర్కే రోజా అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. విశేష పూజలు చేపట్టారు. గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా రాష్ట్ర ప్రభుత్వానికి, యువ నాయకుడు , సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందజేయాలని కోరుకున్నట్లు తెలిపారు మంత్రి ఆర్కే రోజా సెల్వమణి.
రాష్ట్రంలో ఆలయాల అభివృద్దికి తమ ప్రభుత్వం ఎంత గానో కృషి చేస్తోందని చెప్పారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా.
Also Read : రెజ్లర్ల కేసుపై సుప్రీంకోర్టు విచారణ