Krunal Pandya : కృనాల్ పాండ్యా కెప్టెన్సీ ఇన్నింగ్స్
49 పరుగులతో రాణించిన స్కిప్పర్
Krunal Pandya : లక్నో వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ స్కిప్పర్ కృనాల్ పాండ్యా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో ఆరంభంలోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తక్కువ పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో మైదానంలోకి వచ్చాడు కెప్టెన్ కృనాల్ పాండ్యా. ముంబై ఇండియన్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ముందుకు సాగాడు. స్కోర్ బోర్డును తన సహచర ఆటగాడు మార్కస్ స్టోయినిస్ తో కలిసి దుమ్ము రేపాడు.
గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఇక స్టోయినిస్ రఫ్పాడించాడు. బౌలర్లను బెంబేలెత్తించాడు. ఇక స్కిప్పర్ పాండ్యా 49 రన్స్ చేశాడు. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 177 రన్స్ చేసింది. కృనాల్ పాండ్యా , మార్కస్ స్టోయినిస్ కలిసి నాలుగో వికెట్ కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 178 పరుగుల లక్ష్యాన్ని ముందుంచారు.
అనంతరం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇషాన్ కిషన్ , రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్ రాణించినా పరాజయం తప్పలేదు. ఈ గెలుపుతో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది లక్నో సూపర్ జెయింట్స్. ఈ సీజన్ లో తన అద్భుతమైన ఆట తీరుతో దుమ్ము రేపిన సూర్య కుమార్ యాదవ్ ఈసారి 7 పరుగులే చేసి నిరాశ పరిచాడు. మొత్తంగా ఈసారి ఐపీఎల్ 16వ సీజన్ మరింత ఉత్కంఠ భరితంగా మారింది.
Also Read : Marcus Stoinis
