Kamal Mitra BJP : ‘కమల్ మిత్ర’ కింద మహిళలకు శిక్షణ
భారతీయ జనతా పార్టీ ప్రిపరేషన్ ప్లాన్
Kamal Mitra BJP : కర్ణాటక దెబ్బకు భారతీయ జనతా పార్టీ మేల్కొంది. ఈ మేరకు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రిపరేషన్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్లాన్ వేసింది. ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో 200 మంది మహిళలకు కమల్ మిత్ర కార్యక్రమం కింద శిక్షణ ఇవ్వనుంది.
భారతీయ జనతా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ తో పాటు అన్ని ఆఫీస్ బేరర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మహిళా మిత్రలు డిసెంబర్ వరకు ఆన్ లైన్ లో శిక్షణ పొందుతారు. బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా కమల్ మిత్ర(Kamal Mitra BJP) శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా మహిళా మోర్చా జాతీయ చీఫ్ వానతి శ్రీనివాస్ మాట్లాడారు. కమల్ మిత్ర అద్విదీయమైన శిక్షణా కార్యక్రమం. దీని ద్వారా పీఎం నరేంద్ర మోదీ అమలు చేస్తున్న పథకాలపై మహిళా కార్యకర్తలు శిక్షణ ఇచ్చే యోచన ఉందని చెప్పారు.
ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో మహిళా మోర్చాకు చెందిన 200 మంది ఆఫీస్ బేరర్లు , మహిళా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం ద్వారా 1,00,000 మంది కమల్ మిత్ర సోదరీమణులను సిద్దం చేయడం జరుగుతుందన్నారు వానతి శ్రీనివాసన్.
ఉజ్వల యోజన, సుకన్య సమృద్ది యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మాతృత్వ వందన యోజన తదితర 15 ప్రభుత్వ పథకాలపై శిక్షణను తమిళం, తెలుగు, మలయాళం , కన్నడ, బెంగాలీ, అస్సామీ, గుజరాతీ , మరాఠీ భాషలలో తయారు చేశామని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా దేశ వ్యాప్తంగా మహిళా మిత్రలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
Also Read : Akanksha monga