RS Praveen Kumar : బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కుక్కల కాట్లకు బలవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాడి తప్పిన పాలనకు ఇది ఓ నిదర్శనమని పేర్కొన్నారు. పర్యవేక్షణ చేయాల్సిన ఉన్నతాధికారులు నిద్ర పోతున్నారా అని ప్రశ్నించారు.
శుక్రవారం ట్విట్టర్ వేదికగా బీఎస్పీ చీఫ్ తీవ్రంగా స్పందించారు. వీధుల్లో కుక్కల స్వైర విహారం చేస్తున్నాయని, వాటిని నియంత్రించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే పాలన గాడి తప్పిందని, కేవలం ఎన్నికల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోందని ధ్వజమెత్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వరంగల్ పట్టణంలో వీధి కుక్క కాటుకు ఓ బాలుడు బలయ్యాడని, ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్ఎస్పీ షేర్ చేశారు.
ఇందుకు సంబంధించి ఆయన అందమైన క్యాప్షన్ జత పర్చారు. అసలు తెలంగాణను పాలిస్తున్నది ఎవరు అని నిలదీశారు. రోజు రోజుకు వీధి కుక్కల బెడద పెరుగుతోందని, వాటిని కంట్రోల్ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు ఆర్ఎస్పీ.
Also Read : YS Sharmila KCR