CM Siddaramaiah : నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు – సీఎం
సిద్దరామయ్య సంచలన ప్రకటన
CM Siddaramaiah : క్లీన్ ఇమేజ్ స్వంతం చేసుకున్న సిద్దరామయ్య(Siddaramaiah) కర్ణాటకలో రెండోసారి సీఎంగా కొలువు తీరారు. ఇప్పటికే ఆయన కీలక ప్రకటన చేశారు. తన కోసం వచ్చే వారు ఎవరైనా సరే శాలువాలు, పూలు, బహుమతులు తీసుకు రావద్దని కోరారు. వీటికి బదులు మంచి పుస్తకాలు ఇస్తే తాను స్వీకరిస్తానని స్పష్టం చేశారు. సిద్దరామయ్య చేసిన ఈ కామెంట్స్ ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజాగా సోమవారం మరో సంచలన ప్రకటన చేశాడు. అదేమిటంటే తన కోసం పోలీసులు రోడ్డుపై నిల్చోవద్దని , ట్రాఫిక్ రూల్స్ పాటించవద్దని కోరాడు. బెంగళూరులో తన కోసం జీరో ట్రాఫిక్ రూల్ ను ఆపాలని సూచించారు సిద్దరామయ్య(Siddaramaiah). నేను సామాన్యుడిని. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఏ చర్యను తాను ఇష్టపడనని స్పష్టం చేశారు.
ఈ మేరకు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ను కోరినట్లు తెలిపారు స్వయంగా సీఎం . ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిద్దరామయ్య వెల్లడించారు. కర్ణాటక సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఒక రోజు తర్వాత సీఎం తన కోసం జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్ ను వెనక్కి తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఈ నిర్ణయానికి తీసుకోవడానికి గల ప్రధాన కారణం. ట్రాఫిక్ కారణంగా ఆంక్షలు ఉన్న ప్రాంతంలో ప్రయాణించే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూసిన తర్వాత తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య.
Also Read : Sharath Babu Actor