Akash Madhwal : ఆర్సీబీ వదిలేస్తే ముంబై ఆదరించింది
స్టార్ బౌలర్ ఆకాశ్ మధ్వల్ కామెంట్స్
Akash Madhwal : ఐపీఎల్ 16వ లీగ్ లో భాగంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆకాశ్ మధ్వల్(Akash Madhwal) దుమ్ము రేపాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కళ్లు చెదిరే బాల్స్ తో ముప్పు తిప్పలు పెట్టాడు. కేవలం 3.3 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కీలక వికెట్లు తీశాడు. లక్నో సూపర్ జెయింట్స్ పతనాన్ని శాసించాడు. ఇందులో 17 డాట్ బాల్స్ ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఎలిమినేటర్ పరంగా చూస్తే ఆకాశ్ మధ్వల్ ఒక్కడే ఈ ఫీట్ సాధించాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 182 రన్స్ చేసింది. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో మైదానం లోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 16.3 ఓవర్లకే చాప చుట్టేసింది. 101 పరుగులకే ఆలౌటైంది. 81 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. లక్నో జట్టును తన అద్బుతమైన బౌలింగ్ స్పెల్ తో శాసించాడు ఆకాశ్ మధ్వల్. వచ్చీ రావడంతోనే నిప్పులు చెరిగే బంతుల్ని విసిరాడు.
మ్యాచ్ అనంతరం ఆకాశ్ మధ్వాల్ మీడియాతో మాట్లాడాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను 2019లో నెట్ బౌలర్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఉన్నాను. కానీ అవకాశం రాలేదు. ఒక రకంగా చెప్పాలంటే తనను పక్కన పెట్టారన్నాడు. కానీ ముంబై ఇండియన్స్ తనను అన్ క్యాప్డ్ ప్లేయర్ గా తీసుకుందని, ఆ తర్వాత తనకు అవకాశం దక్కిందన్నాడు ఆకాశ్ మధ్వల్.
Also Read : Akash Madhwal