SSMB28 First Look : ప్రిన్స్ మూవీ ఫ‌స్ట్ లుక్ పై ఉత్కంఠ‌

31న టీజ‌ర్ విడుద‌ల‌కు ప్లాన్

SSMB28 First Look : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో మోస్ట్ పాపుల‌ర్ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. మాట‌ల‌తో మంట‌లు పుట్టించ‌గ‌ల‌డు. మాయ చేయ‌గ‌ల‌డు. మెస్మరైజ్ చేసి గుండెల్ని పిండేయ‌గ‌ల‌డు. ఇక ప్రిన్స్ మ‌హేష్ బాబు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఏ పాత్ర‌కైనా న్యాయం చేసే స‌త్తా క‌లిగిన న‌టుడు. అంతే కాదు అందగాడు అంటే ఆయ‌నేన‌న్న అభిప్రాయం చాలా మంది ఫ్యాన్స్ కు ఉంది. గ‌తంలో శోభ‌న్ బాబు కు ఉండేది. ఇప్పుడు మ‌హేష్ బాబు సినిమా వ‌స్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండ‌గే.

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్, అద్భుత న‌టుడు మహేష్ బాబుతో క‌లిసి సినిమా రాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్లు దుమ్ము రేపుతున్నాయి. సోష‌ల్ మీడియ‌లో ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నాయి. మ‌హేష్ బాబుతో క‌లిసి పూజా హెగ్డే, శ్రీ‌లీల న‌టిస్తుండ‌డం విశేషం. దీంతో ఈ సినిమాపై మ‌రింత అంచ‌నాలు పెరిగాయి.

భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. అల వైకుంఠ పురం లో సినిమా త‌ర్వాత మ‌రే సినిమా రాలేదు. ప్ర‌స్తుతానికి మ‌హేష్ సినిమాపై త‌ను కూడా న‌మ్మ‌కం పెట్టుకున్నాడు.

ఇక మ‌హేష్ తండ్రి దివంగ‌త సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి మే 31 సంద‌ర్భంగా ఈ చిత్రం టైటిల్ ను, ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేయ‌నుంది చిత్ర బృందం.

Also Read : Faf Du Plessis Sixer

 

Leave A Reply

Your Email Id will not be published!