Saalu Marada Thimmakka : గ్రీన్ అంబాసిడర్ గా తిమ్మక్క
సిద్దరామయ్య ప్రకటన
Saalu Marada Thimmakka : సీఎం సిద్దరామయ్య సంచలన ప్రకటన చేశారు. సాలుమరద తిమ్మక్క(Saalu Marada Thimmakka) కర్నాటక రాష్ట్ర అంబాసిడర్ (రాయబారి)గా కొనసాగుతుందని స్పష్టం చేశారు. తిమ్మక్కకు కేబినెట్ హోదాను కొనసాగించాలని ఆదేశించారు. 1910లో పుట్టారు. ఇప్పటికీ ఆమె వయస్సు 111 ఏళ్లు. కర్నాటక లోని తుమకూరు జిల్లాలో ఉంటోంది. 2019లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. భారత దేశానికి చెందిన పర్యావరణవేత్త. హులికల్ – కుదుర్ మధ్య 45 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న రహదారిలో 385 మర్రి చెట్లను నాటింది. వాటిని సంరక్షించడంలో గుర్తింపు పొందారు తిమ్మక్క.
ఆమె దాదాపు 8,000 ఇతర చెట్లను కూడా నాటింది. సాలు మరద తిమ్మక్క(Saalu Marada Thimmakka) ఎక్కడా చదువుకోలేదు. సమీపంలోని క్వారీలో సాధారణ కూలీగా పని చేసింది. ఆమె చేసిన కృషికి గుర్తింపుగా జాతీయ పౌర పురస్కారం లభించింది. కర్ణాటకలోని సెంట్రల్ యూనివర్శిటీ 2020 సంవత్సరంలో తిమ్మక్కకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. పిల్లలకు బదులుగా చెట్లను పెంచుతూ పోయారు.
సాలు మరద అంటే చెట్ల వరుస అని అర్థం. తిమ్మక్క నాటిన చెట్ల విలువ దాదాపు 1.5 మిలియన్లు అని అంచనా వేశారు. ఈ చెట్ల నిర్వహణను ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం చేపట్టింది. తిమ్మక్క చేసిన కృషిని గుర్తించిన ప్రభుత్వం ఏకంగా కేబినెట్ హోదా ర్యాంక్ తో రాష్ట్రానికి గ్రీన్ అంబాసిడర్ గా నియమించింది. తిమ్మక్క చేసిన శ్రమకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు వరించాయి. హంపి యూనివర్శిటీ నాడోజ అవార్డు, జాతీయ పౌరుల పురస్కారం, ఇందిరా ప్రియదర్శిని వృక్ష మిత్ర అవార్డు లభించింది.
వీర చక్ర ప్రశస్తి, మహిళా శిశు సంక్షేమం నుండి గౌరవ ధ్రువీకరణ పత్రం , ఐఐఎఫ్టీ నుండి ప్రశంసా పత్రం అందుకున్నారు. కర్ణాటక కల్పవల్లి , గాడ్ ఫ్రే ఫిలిప్స్ బ్రేవరీ అవార్డు, విశాలాక్షి పురస్కారం, విశ్వాత్మ అవార్డు, బీబీసీ 100 మంది మహిళల్లో ఒకరు. పరిసర రతన అవార్డు, గ్రీన్ ఛాంపియన్ , వృక్ష మాత అవార్డు పొందారు.
Also Read : Jadeja Dhoni