Rahul Gandhi : నేను జన పక్షం ఒంటరి పోరాటం
స్పష్టం చేసిన రాహుల్ గాంధీ
Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) అమెరికాలో ఉన్నారు. ఈ సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కో , తదితర నగరాలలో పర్యటించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చారు. తాను ఎవరి మద్దతు కోరడం లేదన్నారు. మా ముందున్న లక్ష్యం ఒక్కటే. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం. భారత రాజ్యాంగం అత్యుత్తమమైనది. దానిని తుంగలో తొక్కేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
అంతిమంగా ప్రజలు ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యలను తాను లేవదీస్తున్నానని, ఇందులో భాగంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మోదీ ప్రభుత్వం ఏనాడో పక్కకు తప్పుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మనం చేస్తున్నది సత్యమైతే, ధర్మ బద్దంగా ఉంటే ఆ పని తప్పకుండా సఫలం అవుతుందని తనకు నమ్మకం ఉందన్నారు రాహుల్ గాంధీ. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని దానిని స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.
భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. వారందరితో తాను సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దీని వల్ల వాళ్లు ఏం కోరుకుంటున్నారో తనకు తెలిసే అవకాశం ఉందన్నారు.
Also Read : Mantralayam Hundi