Madan Lal : మ‌హిళా రెజ్ల‌ర్ల‌కు మ‌ద‌న్ లాల్ మ‌ద్ద‌తు

కానీ రాజ‌కీయ పార్టీలు ఎందుక‌ని ప్ర‌శ్న

Madan Lal : మాజీ భార‌త క్రికెట‌ర్ ,1983 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుపొందిన జ‌ట్టులో స‌భ్యుడైన మ‌ద‌న్ లాల్(Madan Lal) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. గ‌త కొంత కాలంగా మ‌హిళా రెజ్ల‌ర్లు త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు. ఇదే స‌మ‌యంలో తాము సాధించిన ప‌త‌కాల‌ను గంగ‌లో నిమ‌జ్జ‌నం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. చివ‌ర‌కు సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేత న‌రేష్ టికాయ‌త్ స‌ముదాయించ‌డంతో వారు త‌మ విర‌మించుకున్నారు.

ఈ త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వానికి 5 రోజుల గ‌డువు విధించారు. దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ టీమ్ క‌పిల్ సేన కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తాము సంపూర్ణ మ‌ద్ద‌తు తెలియ చేస్తున్న‌ట్లు పేర్కొంది. కానీ తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్ద‌ని కోరింది. ఎంతో క‌ష్ట‌ప‌డి సాధించిన ప‌త‌కాల‌ను ఇలా గంగలో వేయాల‌ని అనుకోవ‌డం మంచిది కాద‌ని , ఇది దేశానికి సంబంధించిన గుర్తింపు అని తెలిపింది.

ఇదిలా ఉండ‌గా శ‌నివారం మ‌ద‌న్ లాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. రెజ్ల‌ర్లు సంయ‌మ‌నం పాటించాల‌ని కానీ రాజ‌కీయ పార్టీల‌కు దూరంగా ఉండాల‌ని సూచించాడు. ఇదే స‌మ‌యంలో కేంద్రం త్వ‌ర‌గా ప‌రిష్క‌రించేందుకు చొర‌వ తీసుకోవాల‌ని కోరాడు మ‌ద‌న్ లాల్.

Also Read : Mamata Banerjee

Leave A Reply

Your Email Id will not be published!