DK Shiva Kumar : జీవితాంతం రుణపడి ఉంటా – డీకే
భావోద్వేగానికి లోనైన డిప్యూటీ సీఎం
DK Shiva Kumar : కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్(DK Shiva Kumar) భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత మొదటిసారిగా తన స్వంత నియోజకవర్గం కనకపురకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తన స్వంత ఊరు దొడ్డ ఆలహళ్లిలో ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కన్నీటి పర్యంతం అయ్యారు. తాను ఊహించిన దాని కంటే ఆదరించారని, ఆశీర్వదించి అద్భుత విజయాన్ని కట్టబెట్టారంటూ కొనియాడారు.
తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు డీకే శివకుమార్. మీ అందరి ఆదరాభిమానాలు, ఆకాంక్షలు తనకు రక్షణగా ఉంటాయని అన్నారు. ఇదిలా ఉండగా కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు డిప్యూటీ సీఎం. కేపీసీసీ చీఫ్ గా ఒంటరి పోరాటం చేశారు. 224 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి 135 సీట్లు తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. అన్నీ తానై వ్యవహరించారు.
ఒక రకంగా ఆక్సిజన్ కోల్పోయి ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఈ క్రెడిట్ అంతా డీకే శివకుమార్ కే దక్కుతుంది. మొత్తంగా కనకపుర నియోజకవర్గంలో ఇది ఏడోసారి గెలుపొందడం.
Also Read : Sharad Pawar