AI Effect US : ఏఐ ఎఫెక్ట్ యుఎస్ లో జాబ్స్ క‌ట్

4 వేల ఉద్యోగాలు హుష్ కాకి

AI Effect US : యావ‌త్ ప్ర‌పంచాన్ని ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI) చుక్క‌లు చూపిస్తోంది. దీని దెబ్బ‌కు వేలాది మంది ఉద్యోగుల‌పై వేటు ప‌డింది. తాజాగా అందిన స‌మాచారం మేర‌కు అమెరికాలో 4 వేల మందికి పైగా జాబ‌ర్స్ జాబ్స్ కోల్పోయారు. ఇదిలా ఉండ‌గా గ‌త నెల‌లో ఏకంగా అంత‌ర్జాతీయ ప‌రంగా చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం ప్ర‌భావం కార‌ణంగా ఏకంగా 19,600 మంది ఉద్యోగాలు కోల్పోవ‌డం విశేషం.

ఒక్క కృత్రిమ మేధ‌స్సు కార‌ణంగానే మ‌రో 3,900 మంది జాబ్స్ కోల్పోయారు. ఈ విష‌యాన్ని తాజాగా అమెరికాకు చెందిన ఛాలెంజ‌ర్ , గ్రే అండ్ క్రిస్మ‌స్ నుండి నెల వారీ నివేదిక వెల్ల‌డించింది. ఈ జాబ్స్ కోల్పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా ఏఐ అని సంస్థ స్ప‌ష్టం చేసింది. దిమ్మ తిరిగే వాస్త‌వాల‌ను వెల్ల‌డించింది. జ‌న‌వ‌రి నుంచి మే మ‌ధ్య కాలంలో సుమారు 4,17, 500 ఉద్యోగాలు కోల్పోయారు.

క‌రోనా మ‌హ‌మ్మారి ప్రారంభం 1.4 మిలియ‌న్ల‌కు పైగా కొలువులు కోల్పోయారు. 2009లో నే 8,20,000 మంది వ‌ర‌ల్డ్ వైడ్ గా జాబ్స్ ను కోల్పోయిన‌ట్లు వెల్ల‌డైంది. కంపెనీలు మంద‌గ‌మ‌నాన్ని ఊహించి నియామ‌కాల‌కు బ్రేకులు వేసిన‌ట్లు అమెరికాకు చెందిన లేబ‌ర్ ఎక్స్ ప‌ర్ట్ , ఛాలెంజ‌ర్ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ , గ్రే అండ్ క్రిస్మ‌స్ ఆండ్రూ ఛాలెంజ‌ర్ స్ప‌ష్టం చేశారు. మొత్తంగా చూస్తే జాబ్స్ మార్కెట్ ప‌రంగా అన్ని విభాగాలలో 2,06,300కి పైగా ఉద్యోగాలు కోల్పోవ‌డం విస్తు పోయేలా చేసింది.

Also Read : Rahul Gandhi : దేశానికి మానవీయ స్ప‌ర్శ అవ‌స‌రం

 

Leave A Reply

Your Email Id will not be published!