Elon Musk Reacts : ఏఐ మామాజాలానికి మస్క్ ఫిదా
ఎమోజీ క్రియేటివిటీకి బిలియనీర్ ఖుష్
Elon Musk Reacts : ఎక్కడ చూసినా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించిన చర్చే విస్తృతంగా జరుగుతోంది. ఈ తరుణంలో ఏఇతో అద్బుతాలు సృష్టిస్తున్నారు క్రియేటర్స్. తాజాగా ఓ క్రియేటర్ ఏకంగా టాప్ మోస్ట్ బిలియనీర్ గా ఉన్న టెస్లా చైర్మన్, ట్విట్టర్ సిఇఓ ఎలాన్ మస్క్(Elon Musk) చిన్నతనంలో ఎలా ఉండేవాడో ఊహించి ఓ ఎమోజీని క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింటిని షేక్ చేస్తోంది. మరో ఫోటోలో గోధుమ రంగు గ్యాలస్ ప్యాంటుతో తెల్లటి చొక్కా ధరించి కనిపించాడు. అతడి గులాబీ బుగ్గలు , తీపి వ్యక్తీకరణ ఇప్పుడు వైరల్ గా మారింది.
కృత్రిమ మేధస్సుతో తయారు చేసిన ఎలాన్ మస్క్ చిత్రాలు అత్యంత సుందరంగా, మనోహరంగా రూపు దిద్దుకున్నాయి. వీటిని చూసి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు ఈ కుబేరుడు. ఇదే క్రమంలో హాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటులను సైతం క్రియేటర్లు ఆధ్యాత్మిక ప్రయాణంలో గనుక ఉంటే ఎలా ఉంటుందని ఊహిస్తూ తయారు చేసిన చిత్రాలు సైతం సామాజిక మాధ్యమాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
మరో వైపు టెస్లా సిఇవో ఎలాన్ మస్క్ తనకు సంబంధించిన చిత్రాలను షేర్ చేయడాన్ని చూసి తెగ ముచ్చట పడి పోయాడు. ఆనందం వ్యక్తం చేశాడు. ఒక రకంగా తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నాడు. భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే దానికి ఏఈ ఒక ఉదాహరణ అని పేర్కొన్నాడు. మానవ మస్తిష్కంలో మొలకెత్తిన ఈ ఆలోచనలే ప్రపంచాన్ని విస్తు పోయేలా చేస్తున్నాయని స్పష్టం చేశాడు ఎలాన్ మస్క్.
Also Read : Opposition Meet : ప్రతిపక్షాల సమావేశం వాయిదా
