Nara Lokesh : జనం కోసం తెలుగుదేశం – లోకేష్
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
Nara Lokesh : టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. యువ గళం పాదయాత్ర ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో కొనసాగుతోంది. ఇవాళ కమలాపురంకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు నారా లోకేష్.
ఇక్కడ వైసీపీ బలంగా ఉంది. కానీ ఊహించని రీతిలో నారా లోకేష్(Nara Lokesh) కు జనాదరణ లభిస్తోంది. ప్రజలు ఆయనకు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. వాటిని పరిగణలోకి తీసుకున్న నారా లోకేష్ తాము పవర్ లోకి వచ్చాక ఎలా తీరుస్తామో వివరించే ప్రయత్నం చేయనున్నారు.
ఇందుకు సంబంధించి కమలాపురం వాసులతో ముఖా ముఖి నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీ ప్రభుత్వం ఆశించిన మేర ప్రజలకు సేవ చేయడం లేదన్నారు. ప్రస్తుతం ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని రాచరిక పాలన కొనసాగుతోందన్నారు నారా లోకేష్.
ఇదే క్రమంలో ఈనెల 7న రాయలసీమ ప్లాన్ విడుదల చేయనున్నారు. కడపలో జరిగే భారీ బహిరంగ సభలో దీనిని విడుదల చేయనున్నారు. మొత్తంగా ఇక్కడ గత ఎన్నికల్లో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ గెలుపొందారు. పేరొందిన పసుపు నేతలు పరాజయం పాలయ్యారు.
Also Read : Smita Sabharwal : మొక్కలు నాటితనే భవిష్యత్తు