Rehana Fathima : ధిక్కార స్వరం ఆమె ప్రస్థానం
ఎవరీ రెహానా ఏమిటా కథ
Rehana Fathima : కేరళకు చెందిన రెహానా ఫాతిమా హక్కుల కార్యకర్త. వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. శబరిమల ఆలయ వివాదం తర్వాత వెలుగులోకి వచ్చింది. సమాజంలోని మూస పద్దతులను, సంప్రదాయాలను నిరసించింది. దాని కోసం నిరంతరం పోరాటం చేస్తూ వచ్చింది. కేరళ లోని ఎర్నాకులంలో మే 30, 1986లో పుట్టారు. ఆమె పూర్తి పేరు రెహానా ఫాతిమా(Rehana Fathima) ప్యారిజాన్ సులైమాన్. మరో పేరు కూడా ఉంది సూర్య గాయత్రి. ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్శిటీలో ఎంసీఏ చదివారు. బీఎస్ఎన్ లో టెక్నీషియన్ గా పని చేశారు. ఏక చిత్రంలో నటించింది రెహానా ఫాతిమా(Rehana Fathima). చాలా ఏళ్లుగా మోడలింగ్ చేస్తూ వచ్చింది. కేరళలో సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజా వాణిని వినిపిస్తూ వచ్చారు. సమానత్వం, స్వేచ్ఛ కోసం తన గొంతు పెంచింది. సినీ నిర్మాత, సామాజిక కార్యకర్త మనోజ్ శ్రీధరన్ తో అనుబంధం కలిగి ఉన్నారు. ఆ తర్వాత మనోజ్ ను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు రెహానా ఫాతిమాకు.
మార్చి 2014లో కేరళ ప్రభుత్వ నైతిక పోలిసింగ్ కు వ్యతిరేకంగా ఆమె కిస్ ఆఫ్ లవ్ ఆందోళనలో పాల్గొంది. ముద్దులతో కూడిన వీడియో క్లిప్ ను తన భర్త మనోజ్ ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశాడు. రెహానా ఫాతిమా తన చిన్నతనం నుండి వివిధ మతాలా పిడివాదాలను, ఆచారాలను , సిద్దాలను సవాల్ చేసింది. 2016లో అయ్యంథోల్ పులి కాళి పండుగలో పాల్గొన్న మొదటి మహిళగా నిలిచారు. మార్చి 2018లో కోజికోడ్ లో ఓ ప్రొఫెసర్ చేసిన నిర్వాకానికి నిరసనగా రెహానా ఫాతిమా తన ఛాతీపై పుచ్చ కాయలను పట్టుకున్న చిత్రాన్ని షేర్ చేసింది. బేర్ ది చెస్ట్ ప్రచారంలో పాల్గొన్నారు.
2017లో మలయాళ చిత్రం ఏకాలో నటించింది. ఇది ఇంటర్ సెక్సువాలిటీపై దృష్టి సారించిన మూవీ. ఈ సినిమాను భారత్ లో నిషేధం విధించారు. సెప్టెంబర్ ,2018లో శబరిమల ఆలయంలోకి మహిళలను ఎందుకు అనుమతించరు అంటూ ఆందోళన చేపట్టింది. కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వాళ్లు కూడా అర్హులేనని పేర్కొంది. మత పరమైన మనోభావాలను దెబ్బ తీసినందుకు రెహానా ఫాతిమాను బీఎస్ఎన్ఎల్ నుంచి తొలగించారు. 2019లో చెక్ బౌన్స్ కేసులో 18 రోజుల జైలు శిక్ష అనుభవించారు. జూన్ 24, 2020న సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు పోక్సో కింద కేసు నమోదైంది. దీనిపై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Also Read : Kerala High Court : నగ్నత్వాన్ని సెక్స్ తో ముడిపెట్టొద్దు