Raghunath Goli Soda Comment : ‘గోలీ సోడా’ గెలుపు కథ
తుల రఘునాత్ విజయ ప్రస్థానం
Raghunath Goli Soda Comment : కాస్తంత భిన్నంగా ఆలోచిస్తే సక్సెస్ సాధించొచ్చని నిరూపించాడు తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన తుల రఘునాథ్(Raghunath). మనోడు ఏకంగా ఏడాదికి లక్షల్లో వచ్చే ఐటీ జీతాన్ని వదులుకున్నాడు. స్వంతంగా వ్యాపారంపై ఫోకస్ పెట్టాడు. అందరూ చులకనగా చూసే గోలీ సోడా బిజినెస్. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. కష్టపడితే దేనినైనా సాధించవచ్చని, వ్యాపారవేత్తగా ఎదగవచ్చని నిరూపించాడు. ఐటీలో టాప్ కంపెనీగా పేరొందిన డెలాయిట్ లో టాప్ జాబ్. కానీ రఘునాథ్(Raghunath) కు ఏ మాత్రం సంతృప్తిని ఇవ్వలేదు. ఒకరి చేతి కింద పని చేయడం కంటే తానే యజమానిగా మారితే ఎలా ఉంటుందన్న ఆలోచనే అతడిని ఒక చోట కూర్చోనీయ లేదు.
ఇంట్లో వాళ్లు వద్దన్నారు. స్నేహితులు, సన్నిహితులు మంచి జాబ్ ఎందుకు వదిలేశావంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ మనోడు తగ్గలేదు. సంకల్పం మంచిదైతే ఎంత కష్టమైనా సక్సెస్ సాధించ వచ్చని నిరూపించాడు రఘునాథ్. అసాధ్యం అన్నది లేనే లేదని ఆచరణలో నిరూపించాడు. ఎవరు వద్దన్నా తాను ముందుకే కదిలాడు. గోలీ సోడా ( పానియం) వ్యాపారం చేయాలని డిసైడ్ అయ్యాడు . కానీ ప్రారంభించాలంటే కనీసం రూ. 30 లక్షలు కావాలి. జాబ్ వదిలేశాడు. ఉన్న వాటితో కలిపితే కొన్ని మాత్రమే చేతిలో ఉన్నాయి. ఇంకేం ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టాడు. చివరకు అనుకున్న దానికి శ్రీకారం చుట్టాడు. అదే మస్త్ గోలీ సోడా వ్యాపారంగా రూపుదిద్దుకుంది.
మెల మెల్లగా గోలీ సోడాకు ఆదరణ లభించింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సరఫరా చేసే స్థాయికి చేరుకుంది వ్యాపారం. మెల మెల్లగా ఆదాయపు బాట పట్టింది. ఒకరి నుంచి ఏకంగా 100 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఒకటా రెండా ఏకంగా పలు ఫ్లేవర్స్ లలో గోలీ సోడా అందుబాటులోకి తీసుకు వచ్చాడు. విదేశీ పానియాలలో గ్యాస్ తక్కువగా ఉంటుంది. కానీ గోలీ సోడాలో మాత్రం ఎక్కువగా గ్యాస్ ఉండడం అదనపు లాభం ఆరోగ్య పరంగా. గాజు బాటిళ్లలో కాకుండా ఇప్పుడు ప్లాసిక్ బాటిళ్లలో కూడా మస్త్ గోలీ సోడాను సరఫరా చేస్తున్నాడు తూల రఘునాథ్(Raghunath). ఇప్పుడు ఆయన ప్రారంభించిన గోలీ సోడా ఇవాళ ఎందరికో స్పూర్తి దాయకంగా మారింది. రుచిలో, శుచిలో, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అత్యాధునిక టెక్నాలజీతో అందిస్తున్నాడు ఈ వ్యాపారవేత్త. ఐటీ కంటే గోలీ సోడానే బెటర్ అంటున్నాడు. ఎవరో ఇచ్చే ఉద్యోగం కోసం వేచి చూడడం కంటే మన కాళ్ల మీద మనం నిలబడేందుకు మార్గం వెతుక్కుంటే బెటర్ కదూ.
Also Read : Mumbai Trans Harbour Link : ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ సిద్దం