Nara Lokesh : ఇంకానా ఇకపై చెల్లదు – లోకేష్
మిషన్ రాయలసీమ విడుదల
Nara Lokesh : టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. యువ గళం పాదయాత్రలో భాగంగా బుధవారం రాయలసీమలో పర్యటించారు. ఈ సందర్బంగా రాయలసీమ మిషన్ పేరుతో డాక్యుమెంట్ ను రిలీజ్ చేశారు లోకేష్. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆనాటి రాజారెడ్డి రాచరిక పాలన సాగించాలని చూస్తున్న జగన్ రెడ్డికి మూడిందన్నారు. ప్రజలు త్వరలోనే తిప్పి కొట్టడం ఖాయమన్నారు. మార్పు కోరుకుంటున్నారని, ఇక ఏపీలో తెలుగుదేశం రావడం ఖాయమని జోష్యం చెప్పారు.
ఈ సైకో పాలకుడిని చూసి ఈసడించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఒక పక్క విద్యుత్ ఛార్జీల బాదుడు, మరో పక్క రిజిస్ట్రేషన్ శాఖలో బాదుడుతో సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేష్(Nara Lokesh). ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్నాడని, కాంట్రాక్టర్లకు, అయినవాళ్లకు మేలు చేకూర్చేలా చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు.
నిర్మాణాల మార్కెట్ విలువ పెంపు, వాణిజ్య సముదాయాలను ప్రత్యేకంగా వడ్డింపు, ఆదాయాన్నిసృష్టించ లేని జగన్ రెడ్డికి పాలించే హక్కు, అర్హత లేదన్నారు నారా లోకేష్. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తాడేపల్లి ప్యాలస్ ను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు టీడీపీ నేత.
Also Read : CM YS Jagan : ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు – జగన్