RBI Governor : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఖుష్(Shaktikanta Das) కబర్ చెప్పారు. గురువారం ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు రుణ గ్రహీతలకు మేలు చేకూర్చేలా వడ్డీ రేట్లను పెంచడం లేదని ప్రకటించారు. దీనివల్ల లక్షలాది మంది అప్పుదారులకు ఒకింత ఉపశమనం లభించినట్లయింది. ఎప్పటి లాగే ఈసారి కూడా వడ్డీ రేట్లను పెంచడం లేదని, యథతాథంగా ఉంచుతున్నట్లు స్పష్టం చేశారు గవర్నర్ శక్తికాంత దాస్.
ఇందులో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి సమీక్షించింది. ఈ మేరకు సమీక్షలో చర్చకు వచ్చిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్.
ఇక గతంలో ప్రకటించిన రెపో రేటును ఎప్పటి లాగే 6.50 శాతం వద్ద ఉంచుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఎస్డీఎఫ్ రేటు 6.25 శాతంగా ఉండగా ఎంఎఎస్ఎఫ్ రేటు 6.75 గా నిర్ణయించామన్నారు. మరో వైపు కీలకమైన బ్యాంక్ రేటుకు సంబంధించి 6.75 వద్ద స్థిరంగా ఉంటాయని స్పష్టం చేశారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.
ఇదిలా ఉండగా ద్రవ్యోల్బణం పెరిగి పోవడంతో ఆర్బీఐ ఎక్కువగా నియంత్రించేందుకు ఫోకస్ పెట్టింది. ఈ మేరకు గత ఏడాది 2022లో ఏకంగా ఆరుసార్లు రెపో రేటును సవరించుకుంటూ పోయింది. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు ఆర్థిక రంగ నిపుణులు.
Also Read : PM Modi Joe Biden : ఇండో పసిఫిక్ పై మోదీ..బైడన్ చర్చ