Bandi Sanjay PM Modi : కేంద్ర స‌ర్కార్ కు బండి థ్యాంక్స్

రాష్ట్రానికి 13 మెడిక‌ల్ కాలేజీలు

Bandi Sanjay PM Modi : భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ , క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కేంద్ర స‌ర్కార్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్ర‌భుత్వం 13 మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుకు అనుమ‌తి ఇచ్చింది. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ , కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సూఖ్ మాండ‌వీయ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

అంతే కాకుండా రాష్ట్రానికి మంజూరైన కాలేజీల‌లో రెండు మెడిక‌ల్ కాలేజీల‌ను కేవ‌లం తాను ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కరీంన‌గ‌ర్ జిల్లాకు కేటాయించార‌ని బీజేపీ స్టేట్ చీఫ్ వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించి త‌న‌కు సంతోషంగా ఉంద‌న్నారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్ర ప్ర‌భుత్వానికి ఉన్న చిత్త‌శుద్దికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు బండి సంజ‌య్(Bandi Sanjay). సంక్షేమం విష‌యంలో కేంద్రం ప్ర‌త్యేక నిధులు ఇస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ సార‌థ్యంలోని బీఆర్ఎస్ ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌క పోయినా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కావాల‌ని నిధులు కేటాయించాలే చేశార‌ని పేర్కొన్నారు. ఇది మోదీకి తెలంగాణ ప‌ట్ల ఉన్న ప్రేమ అని తెలిపారు.

ఇదిలా ఉండ‌గా మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు విష‌యంలో కేంద్ర స‌ర్కార్ స‌హ‌క‌రించ‌డం లేద‌ని కేసీఆర్ చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు బండి సంజ‌య్. మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ ప్ర‌క‌టించినా ప‌ట్టించు కోలేద‌న్నారు బీజేపీ చీఫ్‌.

Also Read : PM Modi Tribute : ధీరోదాత్తుడు బిర్సా ముండా

 

Leave A Reply

Your Email Id will not be published!