YS Sharmila KCR : సీఎం నిర్వాకం నిరుద్యోగుల‌కు శాపం

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల కామెంట్స్

YS Sharmila KCR : నీళ్లు, నిధులు, నియామ‌కాల పేరుతో జ‌నాన్ని బురిడీ కొట్టింది ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన సీఎం కేసీఆర్ జాబ్స్ విష‌యంలో మాట మార్చారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila). శుక్ర‌వారం ఆమె ట్విట్ట‌ర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల‌కు పైగా ఖాళీలు ఉన్నాయ‌ని తాను ఏర్పాటు చేసిన బిశ్వాల్ క‌మిటీ తేల్చింద‌ని, తీరా అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాల ప్ర‌క‌ట‌న‌లు అంటూ న‌మ్మించాడ‌ని, తీరా టీఎస్పీఎస్సీ చేతులు ఎత్తేసింద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పోస్టు కూడా భ‌ర్తీ చేసిన పాపాన పోలేద‌న్నారు.

ప్ర‌జ‌ల‌పై దాడులు చేసేందుకు పోలీసుల‌ను రిక్రూట్ చేసిన న‌యా నిజామా సీఎం కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు వైఎస్ ష‌ర్మిల‌. తెలంగాణ వ‌స్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాన‌న్న దొర తాను కుర్చీ ఎక్కేస‌రికి మ‌రిచి పోయిండ‌ని మండిప‌డ్డారు. నిరుద్యోగులు ప్రాణాలు తీసుకున్నార‌ని, ఇక జాబ్స్ రావేమోన‌ని నిరాశ‌కు లోన‌య్యారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు వైఎస్ ష‌ర్మిల‌.

పెద్ద దొర నిద్ర పోతే ఇక చిన్న దొర కేటీఆర్ మాత్రం చ‌దువుకున్న వాళ్ల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌లేమంటూ చేతులెత్తేశాడ‌ని ఇదేమ‌ని అడిగితే గ‌దంతే అంటూ త‌ప్పించుకుని తిరుగుతున్నాడంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 40 ల‌క్ష‌ల‌కు పైగా ఉన్న నిరుద్యోగుల‌కు ఒక్క పోస్ట్ రాలేద‌ని కానీ క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి మాత్రం అన్ని ప‌ద‌వులు ద‌క్కాయంటూ ఫైర్ అయ్యారు వైఎస్ ష‌ర్మిల‌.

Also Read : Hegdewar Removed : హెడ్గేవార్ అధ్యాయం తొల‌గింపు

 

Leave A Reply

Your Email Id will not be published!