Gita Gopinath Doctorate : గీతా గోపీనాథ్ కు డాక్టరేట్
గ్లాస్లో యూనివర్శిటీ ప్రదానం
Gita Gopinath Doctorate : ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపీనాథ్ కు గౌరవ డాక్టరేట్ దక్కింది. గ్లాస్లో విశ్వ విద్యాలయం ఆమెకు బహూకరించింది. యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతా గోపీనాథ్(Gita Gopinath) డాక్టరేట్ ను అందుకున్నారు. ఇదే సమయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తనను గుర్తించి సర్టిఫికెట్ ను ప్రధానం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు గీతా గోపీనాథ్.
ఇదిలా ఉండగా ప్రముఖ ఆర్థిక వేత్త ఆడమ్ స్మిత్ 300వ జన్మ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆర్థిక రంగానికి స్మిత్ చేసిన సేవల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు గీతా గోపీనాథ్. స్మిత్ రాసిన వెల్త్ ఆఫ్ నేషన్స్ , థియరీ ఆప్ మోరల్ సెంటిమెంట్స్ గుర్తించి వివరించారు. ఈరోజు తనకు ప్రత్యేకంగా గుర్తిండి పోతుందని చెప్పారు చీఫ్ ఎకానమిస్ట్.
ఇదిలా ఉండగా ప్రపంచంలోనే అత్యున్నతమైన పదవిని నిర్వహిస్తున్న గీతా గోపీనాథ్ స్వస్థలం పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా. ఆమె డిసెంబర్ 8, 1971లో పుట్టారు. తొమ్మిదేళ్లప్పుడు మైసూర్ కు మారారు ఫ్యామిలీ. 2018లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ సైన్సెస్ , ది ఎకనోమెట్రిక్ సొసైటీకి ఫెలోగా ఎన్నికయ్యారు. ఇక విదేశాంగ విధానంలో అగ్రశ్రేణి ప్రపంచ ఆలోచనాపరులలో ఒకరిగా గుర్తింపు పొందారు గీతా గోపీనాథ్. ఎన్నో పదవులు చేపట్టారు. ప్రస్తుతం ఐఎంఎఫ్ దిగ్గజ సంస్థకు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
Also Read : MK Stalin Launch : డీఎంకే సైట్ లో సమస్త సమాచారం