Vijay Sai Reddy Lokesh : నారా లోకేష్ పై విజయ సాయి ఫైర్
ఎవరూ పట్టించు కోలేదని గుడ్లేసుకుంటారా
Vijay Sai Reddy Lokesh : ఏపీలో రాజకీయం మరింత ముదురుతోంది. నువ్వా నేనా అంటూ మాటల యుద్దం కొనసాగుతోంది. ఓ వైపు వైసీపీ సర్కార్ అభివృద్దే ఎజెండాగా ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో టీడీపీ సైతం ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. రాయలసీమలో యువ గళం పాదయాత్ర చేపడుతున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కొందరు గుడ్లు వేయడం కలకలం రేపింది. దీనిపై తెగ రాద్దాంతం చోటు చేసుకుంది.
ఇందుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి(Vijay Sai Reddy) శనివారం ట్విట్టర్ వేదికగా సీరియస్ గా స్పందించారు. ఆయన నారా లోకేష్ ను టార్గెట్ చేశారు. ఒకరకంగా చెప్పాలంటే నిప్పులు చెరిగారు. ఎవరూ పట్టించు కోవడం లేదని తనపై తమ కార్యకర్తల తోనే కోడిగుడ్లు వేయించుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆపై తమ ప్రభుత్వంపై అపవాదు వేసేందుకు యత్నించారంటూ మండిపడ్డారు ఎంపీ విజయ సాయి రెడ్డి. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ఇప్పటికే ప్రజలు విసిరి కొట్టారని, రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలకు కోలుకోలేని రీతిలో షాక్ ఇవ్వడం ఖాయమని జోష్యం చెప్పారు. గుడ్లు వేయించు కున్నంత మాత్రాన గండర గండలు అయిపోతారా అంటూ ఎంపీ ప్రశ్నించారు. నారా లోకేష్ ను ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రజలకు అన్ని ఫలాలు అందుతున్నాయని , ఇచ్చిన హామీలలో 99 శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు విజయ సాయి రెడ్డి.
Also Read : DK Shiva Kumar : పాలనా వ్యవస్థకు పేరు తీసుకు రావాలి