DK Shiva Kumar : మధ్యప్రదేశ్ లో ట్రబుల్ షూటర్
కీలక స్ట్రాటిజిస్ట్ గా మారనున్న డీకే
DK Shiva Kumar : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తన సంప్రదాయ కట్టుబాట్ల నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఆక్టోపస్ లా విస్తరించిన భారతీయ జనతా పార్టీని మట్టి కరిపించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. తాజాగా కర్ణాటకలో చోటు చేసుకున్న ప్లాన్ ను త్వరలో జరగబోయే మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ట్రబుల్ షూటర్ అమిత్ చంద్ర షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాల త్రయంకు కోలుకోలేని షాక్ ఇచ్చారు డీకే శివకుమార్(DK Shiva Kumar).
ఆయన సారథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో భారీ మెజారిటీని సాధించింది. 224 సీట్లకు గాను కాంగ్రెస్ 135 సీట్లు సాధించి దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది. బీజేపీ 65 సీట్లకే పరిమితమై ప్రభుత్వాన్ని కోల్పోయింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించింది డీకే శివకుమార్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా మారి పోయారు అనతి కాలంలోనే. ప్రస్తుతం ఆయన పార్టీ చీఫ్ తో పాటు డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కార్య రంగంలోకి దిగారు. తన టార్గెట్ లోక్ సభలో ఎంపీ సీట్లను కైవసం చేసుకోవడమేనని స్పష్టం చేశారు. తాజాగా అందిన సమాచారం ఏమిటంటే డీకే శివకుమార్ ను మధ్య ప్రదేశ్ ఎన్నికలలో కీలక భూమిక పోషించేందుకు పార్టీ నిర్ణయించినట్లు టాక్. ఏది ఏమైనా ఒక్క విజయం ఇప్పుడు కాంగ్రెస్ కు ఎనలేని ఆక్సిజన్ ను ఇచ్చింది.
Also Read : Aasia Begum Auto driver : ఆసియా బేగం ఆటో డ్రైవర్