MK Stalin : యుద్దానికి సిద్దం కేంద్రానికి భ‌య‌ప‌డం – స్టాలిన్

మోదీ, అమిత్ షా పై షాకింగ్ కామెంట్స్

MK Stalin : డీఎంకే చీఫ్‌, త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. త‌మ పార్టీ ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జాస్వామ్య స్పూర్తికి భంగం క‌లిగిస్తూ అడుగ‌డుగునా ఆటంకాలు సృష్టిస్తున్న ప్ర‌ధాని మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా ఆట‌లు ఇక సాగ‌వ‌న్నారు. తాము కేంద్రంతో స‌త్ సంబంధాల‌ను కొన‌సాగిస్తూ వ‌చ్చామ‌ని కానీ త‌మ ఆత్మ గౌర‌వాన్ని ఇబ్బంది పెట్టేలా చేస్తే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చ‌రించారు.

డీఎంకే పార్టీకి సంబంధించిన కొత్త‌గా అద‌న‌పు స‌మాచారంతో అప్ డేట్ చేసిన వెబ్ సైట్ (డీఎంకే.ఇన్)ను సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌కు న‌చ్చిన వారి ప‌ట్ల సానుకూలంగా ఉండ‌డం , వ్య‌తిరేకించిన వారి ప‌ట్ల క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డం గ‌త కొంత కాలంగా కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ చేస్తోంద‌ని ఆరోపించారు.

గ‌త తొమ్మిది సంవ‌త్స‌రాల కాలంలో కేంద్రం త‌మిళ‌నాడు రాష్ట్రానికి ఏం ఇచ్చిందో బ‌హిరంగంగా చెప్పాల‌ని ఎంసీ ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. భాష పేరుతో ఆధిప‌త్యం చెలాయించాల‌ని చూడ‌డం త‌ప్ప‌, అయినా త‌మిళులు ఎక్క‌డున్నా వాళ్లు త‌మ ఆత్మ గౌర‌వం కోసం పోరాడుతూనే ఉంటార‌ని ఇది చ‌రిత్ర చెప్పిన స‌త్యం అని స్ప‌ష్టం చేశారు సీఎం.

ఇక‌నైనా మోదీ, అమిత్ షా మారాల‌ని రాబోయే కాలంలో ఎవ‌రికి జ‌నం ప‌ట్టం క‌డ‌తారో తేలుతుంద‌న్నారు ఎంకే స్టాలిన్. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Tech Mahindra CEO : ఏఐ సిఇఓకు మ‌హీంద్రా సిఇఓ స‌వాల్

Leave A Reply

Your Email Id will not be published!