Arvind Kejriwal : మోదీ అభివృద్ది నిరోధ‌కుడు – కేజ్రీవాల్

ప్ర‌ధాన‌మంత్రిపై సీఎం షాకింగ్ కామెంట్స్

Arvind Kejriwal : ఆప్ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. ఆయ‌న ప్ర‌ధాన మంత్రిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం ఢిల్లీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తీసుకు వ‌చ్చిన ఆర్డినెన్స్ ను నిర‌సిస్తూ ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున మ‌హా ర్యాలీ చేప‌ట్టారు. వేలాది మంది ఆప్ అభిమానులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌ర‌లి వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్ర‌సంగించారు.

దేశంలో ఎక్క‌డా లేని రీతిలో విద్యా వ్య‌వ‌స్థ‌ను అభివృద్ది చేశామ‌ని చెప్పారు సీఎం. తాను బ‌డులు, మౌలిక వ‌స‌తులు, ఆస్ప‌త్రుల‌ను ఏర్పాటు చేస్తే దానిని అడ్డుకునేందుకు న‌రేంద్ర మోదీ ప్ర‌య‌త్నం చేశారంటూ ఆరోపించారు. ప్ర‌జ‌లు ఇటీవ‌ల జ‌రిగిన ఢిల్లీ మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో చెంప ఛెళ్లుమ‌నిపించార‌ని ఎద్దేవా చేశారు.

మోదీ కేవ‌లం త‌నపై ఉన్నంత శ్ర‌ద్ధ దేశంపై లేద‌న్నారు. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌తో పాటు అన్ని వ‌ర్గాల ప్ర‌జల‌కు మేలు చేకూర్చేలా త‌మ ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని చెప్పారు. కానీ ఆప్ ను నిర్వీర్యం చేసేందుకు, త‌న‌ను ఇరికించేందుకు మోదీ త్ర‌యం ప్ర‌య‌త్నాలు చేసింద‌ని ఆరోపించారు. కానీ తాను ఎక్క‌డా లొంగ లేద‌న్నారు. ఇవాళ రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆటంకాలు క‌లిగించినా ఎక్క‌డా అభివృద్దిని ఆప‌లేదని చెప్పారు అర‌వింద్ కేజ్రీవాల్.

Also Read : Arvind Kejriwal : మోదీ అభివృద్ది నిరోధ‌కుడు – కేజ్రీవాల్

 

Leave A Reply

Your Email Id will not be published!