RS Praveen Kumar : తప్పుడు పత్రాలతో భూముల కబ్జా – ఆర్ఎస్పీ
16 నకిలీ కంపెనీల భూ దాహం
RS Praveen Kumar : బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే భూ అక్రమార్కులు రెచ్చి పోతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) శంషాబాద్ మండలం ఝాంసిమియా గూడలో భూములు కోల్పోయిన పేదలను పరామర్శించారు. ఈ సందర్బంగా ఇక్కడ గోల్డ్ స్టోన్ ప్రసాద్ , మిగతా 16 నకిలీ కంపెనీలు భూములను ఆక్రమించు కున్నారని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
వీరి కారణంగా విలువైన భూములను కోల్పోయిన 100 మంది పేద రైతులకు సంఘీ భావం ప్రకటించారు. నకిలీ పత్రాలతో ఎలా కాజేసుకున్నారో తెలిపారు. ఇక్కడి రెవిన్యూ అధికారులతో కుమ్మక్కై దొంగ పత్రాలు సృష్టించి పేదలకు చెందిన భూములను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు బీఎస్పీ చీఫ్. వీరి నిర్వాకం , మోసం కారణంగా పేద రైతులు రోడ్డు పాలయ్యారని మండిపడ్డారు.
దొంగ పత్రాలతో అధికారులతో కుమ్మకై కోర్టులను కూడా తప్పుదోవ పట్టించారంటూ నిప్పులు చెరిగారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రైతుల జీవితాలతో ఆటాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుండగులకు, భూ మాఫియా దారులకు స్థానిక ఎమ్మెల్యే అండ కూడా ఉందని ధ్వజమెత్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
Also Read : Modi Brutally Viral : మోదీ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ