Nara Lokesh Chandrababu : నాన్నా నువ్వే నా హీరో – లోకేష్
నారా చంద్రబాబు నాయుడికి విషెస్
Nara Lokesh Chandrababu : ఫాదర్స్ డే సందర్బంగా తన తండ్రి టీడీపీ పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బెస్ట్ విషెస్ చెప్పారు తనయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇద్దరూ ఇప్పుడు ఏపీలో వైసీపీ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఆపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రతి ఏటా జూన్ 18న యావత్ ప్రపంచం తండ్రుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.
ఇందులో భాగంగా పలువురు ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వారే కాకుండా రాజకీయ నాయకులు కూడా తమ తండ్రులకు పితృదినోత్సవ అభినందనలు తెలియ చేస్తున్నారు. తాజాగా నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడికి(Chandrababu Naidu) విషెస్ తెలిపారు. తనను తండ్రి అక్కున చేర్చుకున్న ఫోటోను ప్రత్యేకంగా షేర్ చేశారు.
ఆసక్తికర క్యాప్షన్ కూడా జతపర్చారు. నాన్నా నువ్వే నాకు నిజమైన హీరోవి అంటూ కితాబు ఇచ్చారు. ఇలాగే ఉండాలని, నిన్ను మరోసారి ఏపీకి సీఎంగా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సభలు, సమావేశాలలో బిజీగా ఉన్నారు. ఇక నారా లోకేష్ యువ గళం పేరుతో ప్రస్తుతం ఏపీలో విస్తృతంగా పాదయాత్ర చేపట్టారు. ఇవాల్టితో 130వ రోజుకు చేరుకుంది లోకేష్ చేపట్టిన పాదయాత్ర.
Also Read : KTR KCR : నా తండ్రి కేసీఆర్ నాకు స్పూర్తి