Bandi Sanjay : కొల్లగొట్టడం బీఆర్ఎస్ నమూనా – బండి
కల్వకుంట్ల కుటుంబంపై షాకింగ్ కామెంట్స్
Bandi Sanjay : దోచు కోవడం, దాచు కోవడం , కమీషన్ల పేరుతో దండు కోవడం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పాలన నమూనా అంటూ నిప్పులు చెరిగారు భారతీయ జనతా పార్టీ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. తెలంగాణలో దొరల, గడీల, నయా నిజాం పాలన సాగుతోందని మండిపడ్డారు. త్వరలో ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని జోష్యం చెప్పారు. ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు బండి సంజయ్.
ఏం సాధించారని తెలంగాణ పేరుతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తాన్నావంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు ఇలా ప్రతి ఒక్కరు తెలంగాణ వనరులను, సంపదను గంప గుత్తగా దోచుకున్నారని ఆరోపించారు. ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మీరు మాత్రం స్వంత విమానాల్లో ఎలా తిరుగుతారంటూ ప్రశ్నించారు.
మాయ మాటలు చెప్పడం, అబద్దాలతో బురిడీ కొట్టించడం, మోసం చేయడం, కమీషన్లు దండు కోవడం బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం అంటూ ఎద్దేవా చేశారు బండి సంజయ్(Bandi Sanjay) . పంచ భూతాలను పూర్తిగా వ్యాపారం చేసిన ఘనత కల్వకుంట్ల ఫ్యామిలీకి దక్కుతుందని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం సమగ్ర, సమీకృత, సమ్మిళిత, మార్పు అభివృద్దే బీఆర్ఎస్ నమూనా అంటూ పేర్కొన్నారు బీజేపీ చీఫ్.
Also Read : Virat Kohli : సంపాదనలో విరాట్ కోహ్లీ టాప్