Smita Sabharwal : స్మితం జన హితం
స్మితా సబర్వాల్ కు 45 ఏళ్లు
Smita Sabharwal : తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు స్మితా సబర్వాల్. భర్త ఐపీఎస్. భార్య ఐఏఎస్. ప్రస్తుతం కీలకమైన ఉన్నత పదవిలో ఉన్నారు. ఆమె జూన్ 19న పుట్టిన రోజు. వయసు 45 ఏళ్లు. పీపుల్స్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు. ఉద్యమ సమయంలో అమరుల తల్లులను అక్కున చేర్చుకున్నారు. వారిని గౌరవించారు. 1977లో డార్జింగ్ లో పుట్టారు. 2001లో తెలంగాణ కేడర్ కు చెందిన అధికారి. ప్రజలతో కలిసి ఉండడం, వారి సమస్యలను వినడం, పరిష్కరించడంతో మరింత గుర్తింపు పొందారు.
ఆమె బెంగాలీ ఆర్మీ కుటుంబానికి చెందిన వారు. సికింద్రాబాద్ లోని సెయింట్ ఆన్స్ స్కూల్ లో చదివారు. ఐసీఎస్ఈలో టాపర్ గా నిలిచారు. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో వాణిజ్య శాస్త్రంలో పట్టభద్రురాలు. 2000లో యుపీఎస్సీ కి ప్రిపేర్ అయ్యింది. పరీక్ష రాసింది. ఆల్ ఇండియాలో నాల్గో ర్యాంకు సాధించింది. అప్పుడు ఆమె వయస్సు 22 ఏళ్లు కావడం విశేషం.
2001లో ముస్సోరీలో శిక్షణ పొందారు. ఆదిలాబాద్ జిల్లాలో ట్రైనింగ్ పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్(IAS) గా బాధ్యతలు చేపట్టారు. కడప డీఆర్డీఏ పీడీగా పని చేశారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా ఉన్నారు. అక్కడ ఫండ్ యువర్ సిటీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విశాఖలో వాణిజ్య పన్నుల శాఖలో డిప్యూటీ కమిషనర్ గా పని చేశారు స్మితా సబర్వాల్(Smita Sabharwal). కర్నూల్ జాయింట్ కలెక్టర్ గా ఉన్నారు.
ఆ తర్వాత హైదరాబాద్ లో జేసీగా పని చేశారు. 2011లో కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు. ఆరోగ్యం, విద్యా రంగంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అమ్మ లాలనతో పేరు పొందారు. పీఎం అవార్డు పొందారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటరు పండుగ చేపట్టారు. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత మెదక్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు. పలు అవార్డులు అందుకున్నారు. మొత్తంగా ఆమె ప్రజల మనిషిగా, అధికారిగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.
Also Read : Congress MLCs : కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా నామినేషన్ దాఖలు