Congress Slams : మ‌ణిపూర్ పై స‌మ‌యం ఇవ్వ‌ని మోదీ

నిప్పులు చెరిగిన ప్ర‌తిప‌క్షాలు

Congress Slams : కాంగ్రెస్ పార్టీ(Congress) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మ‌ణిపూర్ విష‌యంపై మాట్లాడేందుకు స‌మ‌యం ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించింది. త‌మ పార్టీతో క‌లుపుకుని ఇత‌ర పార్టీల‌తో స‌హా మ‌ణిపూర్ లో చోటు చేసుకున్న హింసాకాండ గురించి స్వ‌త‌హాగా తెలియ చేయాల‌ని కోరినా ఇప్ప‌టి వ‌ర‌కు ఉలుకు లేదు ప‌లుకు లేద‌ని వాపోయింది. జూన్ 10వ తేదీ నుండి నేటి దాకా తాము చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేద‌ని పేర్కొంది.

విచిత్రం ఏమిటంటే భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన నాయ‌కులు కూడా మ‌ణిపూర్ హింస గురించి చెప్ప‌లేక పోతున్నార‌ని మండిప‌డింది. విచిత్రం ఏమిటంటే ఆది పురుష్ సినిమాలో ద్వంద్వ అర్థాల‌తో డైలాగులు రాసిన మ‌నోజ్ ముంతాషిర్ శుక్లాకు ప్ర‌ధాని మోదీ టైం ఇచ్చార‌ని ఆరోపించింది. అంతే కాదు 45 నిమిషాల పాటు మాట్లాడారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నిత్యం ప్ర‌చారంపై ఉన్నంత శ్ర‌ద్ద ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై మోదీకి చిత్త శుద్ది లేద‌ని ఫైర్ అయ్యింది.

ఇదిలా ఉండ‌గా జాతుల మ‌ధ్య వైరం మ‌ణిపూర్ లో మంట‌లు రాజేసింది. ఇరు వ‌ర్గాల మ‌ధ్య చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ‌లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. 50 వేల మంది రాష్ట్రం విడిచి వెళ్లి పోయారు. కానీ ప‌వ‌ర్ లో ఉన్న బీజేపీ ఏం చేయ‌లేక పోతోంది.

Also Read : Jagadish Shettar : ఛాన్స్ ఇచ్చిన సోనియాకు థ్యాంక్స్

 

Leave A Reply

Your Email Id will not be published!