Neil Tyson PM Modi : మోదీతో నీల్ టైసన్ ములాఖత్
అమెరికాలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త
Neil Tyson PM Modi : యుఎస్ పర్యటనలో ఉన్న భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రముఖ వరల్డ్ బిలియనీర్ టెస్లా సంస్థ చైర్మన్ , ట్విట్టర్ సిఇవో ఎలాన్ మస్క్ ప్రధానితో భేటీ అయ్యారు. అనంతరం అమెరికాకు చెందిన మోస్ట్ పాపులర్ ఖగోళ శాస్త్రవేత్త నీల్ టైసన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా అంతరిక్షం రంగంపై కీలకంగా చర్చించారు. ఇరు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా సత్ సంబంధాలు నెలకొన్నాయి.
ప్రత్యేకించి భారత దేశం అంతరిక్ష పరంగా టాప్ లో కొనసాగుతోంది. ఇతర దేశాలతో పోటీ పడుతోంది. మొన్ననే శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీని విజయవంతంగా ప్రయోగించింది. నాసాకు చెందిన వ్యోమోగాములతో కలిసి ప్రయత్నం చేసింది. ఇదిలా ఉండగా భారత దస్త్రశంలోని పిల్లలకు వేసవి సెలవుల్లో ఇస్రో అంతరిక్ష శిబిరాలను నిర్వహిస్తే బాగుంటుందని ఈ సందర్బంగా నీల్ టైసన్(Neil Tyson) కు సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
ఇస్రో ఇప్పటికే అద్భుత విజయాలను సాధించిందని గుర్తు చేశారు. యువతలో అద్భుతమైన టాలెంట్ ఉందని దానికి పదును పెడితే బాగుంటుందన్నారు. అటు అమెరికా అటు భారత్ కలిస్తే ప్రపంచంలో మరిన్ని అద్భుతాలను సృష్టించ వచ్చని తెలిపారు మోదీ టైసన్ కు.
Also Read : Elon Musk PM Modi : మోదీతో ఎలాన్ మస్క్ భేటీ
