Uddhav Thackeray : పీఎం కేర్స్ ఫండ్ పై విచార‌ణ చేప‌ట్టాలి

శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రే

Uddhav Thackeray : మ‌రాఠాలో మ‌రోసారి రాజ‌కీయం వేడెక్కింది. అధికారంలో ఉన్న షిండే బీజేపీ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు ప్ర‌తిప‌క్ష నేత శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ చీఫ్ ,మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. క‌రోనా స‌మ‌యంలో బాధితుల‌ను ఆదుకునేందుకు పీఎం కేర్స్ ఫండ్ ను ఏర్పాటు చేశార‌ని, ఇందులో భాగంగా భారీ ఎత్తున కోట్లాది రూపాయ‌లు విరాళాల రూపేణా వ‌చ్చాయ‌ని అన్నారు. పీఎం కేర్స్ ఫండ్ ఎవ‌రికి ఎంతెంత ఖ‌ర్చు చేసింద‌నే దానిపై శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు ఉద్ద‌వ్ ఠాక్రే.

ఇదిలా ఉండ‌గా కోవిడ్ కు సంబంధించిన స్కాంలో శివ‌సేన పార్టీ బాల్ ఠాక్రే పార్టీకి చెందిన కొంద‌రిని ఈడీ విచారించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ముందు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల త‌మ‌పై కాకుండా పీఎం మోదీని, ఆయ‌న‌కు వంత పాడుతున్న వ్య‌క్తులు, సంస్థ‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని డిఆండ్ చేశారు ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray).

కాగా 2020లో ప్రైమ్ మినిస్ట‌ర్స్ సిటిజ‌న్ అసిస్టెంట్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమ‌ర్జెన్సీ సిట్యుయేష‌న్స్ ఫండ్ పేరుతో సంస్థ‌ను ఏర్పాటు చేశారు. దీనిని ప‌బ్లిక్ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ గా కేంద్ర స‌ర్కార్ ఏర్పాటు చేసింది. ట్ర‌స్ట్ కు ఊహించ‌ని రీతిలో నిధులు వ‌చ్చాయి. వీటిపై ఇంత వ‌ర‌కు ఎందుకు విచార‌ణ చేప‌ట్ట‌లేద‌ని ప్ర‌శ్నించారు మాజీ సీఎం.

Also Read : Raj Nath Singh : పంజాబ్ లో శాంతి భ‌ద్ర‌త‌లు విఫ‌లం

Leave A Reply

Your Email Id will not be published!