Egyptian Woman Signs : ‘షోలే’ పాట‌కు మోదీ ఫిదా

యే దోస్తీ హ‌మ్ న‌హీ తోడేంగే

Egyptian Woman Signs : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఎక్క‌డికి వెళ్లినా జ‌నం నీరాజ‌నం ప‌లుకుతున్నారు. ఆయ‌న‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌వుతోంది. ఇప్ప‌టికే విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాన‌మంత్రి అమెరికా ప‌ర్య‌ట‌న ముగించుకున్నారు. అక్క‌డ దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్(Joe Biden) , ప్ర‌థ‌మ పౌరురాలు జిల్ బైడెన్ వైట్ హౌస్ లో ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీక‌రించారు. అనంత‌రం ప్ర‌పంచాన్ని శాసిస్తున్న టెక్ కంపెనీల దిగ్గ‌జాల‌తో భేటీ అయ్యారు. మోదీ చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించింది. ఈ మేర‌కు కోట్లాది రూపాయ‌లు భార‌త్ కు పెట్టుబ‌డి రూపంలో వ‌చ్చాయి. యుఎస్ ప‌ర్య‌ట‌న ముగించిన అనంత‌రం నేరుగా ఈజిప్టు దేశ అధ్య‌క్షుడి ఆహ్వానం మేర‌కు ఆ దేశంలో కాలు మోపారు.

ఈ సంద‌ర్బంగా అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ఈజిప్టుకు చెందిన అమ్మాయి న‌రేంద్ర మోదీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికింది. 1978లో విడుద‌లై అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన సినిమాగా ఇప్ప‌టికీ రికార్డు తిర‌గ రాసిన షోలే సినిమా లోని పాపుల‌ర్ సాంగ్ యే దోస్తీ హ‌మ్ న‌హీ తోడేంగే పాట‌తో గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పింది. దీంతో పాట‌ను ఎంతో ఆస‌క్తితో విన్నారు ప్ర‌ధాన‌మంత్రి. పాట పాడిన అనంత‌రం ఆమెను ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు ప్ర‌ధాన‌మంత్రి.

ఓహ్ నీ గొంతు అద్భుతం. అంతే కాదు మ‌రోసారి తాను ఇష్ట‌ప‌డే ఈ పాట‌ను పాడావు..మ‌ళ్లీ ఆనాటి షోలేను గుర్తుకు తెచ్చావంటూ కితాబు ఇచ్చారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి నెట్టింట్లో. ఇక ప్ర‌ధాన‌మంత్రికి పాట‌ల‌న్నా, పుస్త‌కాల‌న్నా, సంస్కృతి, సంప్ర‌దాయాలంటే విప‌రీత‌మైన అభిమానం. ఈ రూప‌కంగా మ‌రోసారి త‌న‌లోని ఆనందాన్ని పంచుకోవ‌డం విశేషం.

Also Read : Uddhav Thackeray : పీఎం కేర్స్ ఫండ్ పై విచార‌ణ చేప‌ట్టాలి

Leave A Reply

Your Email Id will not be published!