Lokesh Kanagaraj : విజయం కోసం ‘లియో’ సిద్దం
లోకేష్ కనగరాజ్ విజయ్ మూవీ
Lokesh Kanagaraj : తలపతి విజయ్ అంటే తమిళనాడులోనే కాదు యావత్ భారతంలో కూడా చాలా మంది ఇష్టపడతారు. ఆయనను ప్రత్యేకంగా అభిమానిస్తారు. డిఫరెంట్ మేనరిజం ఉన్న నటుడు. ఎలాంటి వేరియేషన్స్ నైనా సులభంగా పలికించగలడు. అతడి డైలాగ్ డెలివరీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఇక ఈ మధ్యన తను పాలిటిక్స్ లోకి వస్తాడని తెగ ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం లేక పోలేదు. బాబా సాహెబ్ అంబేద్కర్ , కామరాజ్ , పెరియార్ , తదితర మహానుభావులను ప్రత్యేకంగా చదవాలని పిలుపునిచ్చాడు విద్యార్థులకు. గతంలో జరిగిన ఎన్నికల్లో బరిలోకి దిగుతాడని ప్రచారం జరిగింది.
కానీ డీఎంకేకు అంతర్గతంగా మద్దతు ఇచ్చాడు. ఆపై తన సినిమాతో ఏకంగా కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ మోదీ సర్కార్ తీసుకు వచ్చిన జీఎస్టీని ఏకి పారేశాడు. అప్పట్లో కష్ట కట్టింది సర్కార్. ఆపై విస్తృతంగా తనిఖీలు, సోదాలు చేపట్టింది. కానీ ఎక్కడా మనోడు దొరకలేదు. ఇది పక్కన పెడితే మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడిగా పేరు పొందాడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj). ఇంకేం మనోడి ఆలోచనలకు కరెక్టుగా దొరికాడు హీరో అతడే తలపతి విజయ్.
అతడితో ఇంతకు ముందు మాస్టర్ తీశాడు. అది ఇండస్ట్రీని షేక్ చేసింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషకం అందుకునే నటుడిగా గుర్తింపు పొందాడు తలపతి విజయ్. ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా విడుదలకు సిద్దంగా ఉంది . అదే లియో. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ దుమ్ము రేపింది. ఆపై రిలీజ్ చసిన నా రెడీ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. షూటింగ్ సందర్భంగా నటుడు, దర్శకుడు ఓ స్టిల్ ఇచ్చారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read : Priyank Kharge : బీజేపీ చట్టానికి అతీతమా – ఖర్గే
