Devendra Fadnavis : బ‌స్సు ఘ‌ట‌నకు రోడ్డు నిర్మాణం కాదు

రోడ్డు నిర్మాణం దీనికి కార‌ణం కాదు

Devendra Fadnavis : మ‌హారాష్ట్రలో శ‌నివారం తెల్ల‌వారుజామున చోటు చేసుకున్న బ‌స్సు ప్ర‌మాదం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. పూణేకు వెళుతున్న బ‌స్సు అర్ధ‌రాత్రి 1.30 గంట‌ల‌కు ప్ర‌మాదానికి గురైంది. బ‌స్సు స్తంభాన్ని ఢీకొట్టింది. బోల్తా ప‌డ‌డంతో టైర్లు పేలి పోయాయి. దీంతో 25 మంది బ‌స్సు మంట‌ల్లో ఆహుతయ్యారు. చివ‌ర‌కు ఏడుగురు మాత్రం బ‌య‌ట ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు చిన్నారులు మృత్యువాత ప‌డ్డారు. ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే సీఎం షిండే స్పందించారు. బాధిత కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు.

ఇదే స‌మ‌యంలో ఘ‌ట‌నా స్థ‌లాన్ని ఇవాళ సంద‌ర్శించారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్(Devendra Fadnavis). రోడ్డు నిర్మాణం వ‌ల్లనే బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం. రోడ్డు నిర్మాణం వ‌ల్ల బ‌స్సు ప్ర‌మాదానికి గురి కాలేద‌ని స్ప‌ష్టం చేశారు. విచార‌ణ‌లో ఈ విష‌యం తేలింద‌న్నారు. ఇప్ప‌టికే విచార‌ణ‌కు ప్ర‌భుత్వం ఆదేశించింద‌ని చెప్పారు. ఘ‌ట‌నా స్థ‌లం నుంచి మీడియాతో మాట్లాడారు దేవేంద్ర ఫ‌డ్న‌వీస్.

ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స్పందించారు. బస్సు ఘ‌ట‌న‌పై తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. బాధిత కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌ల చొప్పున సాయం ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వారికి రూ. 50 వేలు అంద‌జేస్తామ‌ని తెలిపారు.

Also Read : PM Modi Congratulate : క‌బ‌డ్డీ టీంకు మోదీ కితాబు

Leave A Reply

Your Email Id will not be published!