Khammam CP : కాంగ్రెస్ నేత‌ల మాట‌లు అబ‌ద్దం

ఖ‌మ్మం సీపీ విష్ణు వారియ‌ర్

Khammam CP : ఖ‌మ్మంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన జ‌న గ‌ర్జ‌న స‌భ‌కు తాము స‌హ‌క‌రించామ‌ని స్ప‌ష్టం చేశారు పోలీస్ క‌మిష‌న‌ర్ విష్షు న్ వారియార్. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయ‌కులు చేస్తున్న ఆరోప‌ణ‌లు అబ‌ద్ద‌మ‌ని కొట్టి పారేశారు. తాము పార్టీ ప‌రంగా స‌భ నిర్వ‌హించేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చామ‌న్నారు. భారీ ఎత్తున జ‌నం వ‌స్తుండ‌డంతో సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామ‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ నేత‌లు కావాల‌ని త‌మ‌పై బుర‌ద చ‌ల్లేందుకు ప్ర‌య్న‌తం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. తాము నిబ‌ద్ద‌త‌తో వృత్తి ధ‌ర్మాన్ని పాటిస్తున్నామ‌ని, కానీ వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌భ్య‌త కాద‌ని పేర్కొన్నారు సీపీ(CP). వాహ‌నాల‌ను త‌ప్ప‌నిస‌రిగా విధుల్లో భాగంగా చెక్ చేస్తున్నామ‌ని, తాము స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చామ‌ని స్ప‌ష్టం చేశారు సీపీ .

కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు సీపీ విష్ణు వారియ‌ర్. ఎక్క‌డా ఆప‌డం లేద‌ని, ఎలాంటి ఆంక్ష‌లు విధించ లేద‌ని పేర్కొన్నారు. ఇలా చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని, పూర్తిగా స‌హ‌క‌రిస్తే స‌భ స‌క్సెస్ అవుతుంద‌న్నారు. స‌భ అయిపోయేంత వ‌ర‌కు పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌లో నిమ‌గ్న‌మై ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు సీపీ.

Also Read : Ajit Pawar Revolt : 30 మంది ఎమ్మెల్యేల‌తో అజిత్ జంప్

Leave A Reply

Your Email Id will not be published!