Daggubati Purandeswari : దుర్గమ్మ సన్నిధిలో పురందేశ్వరి
సాదర స్వాగతం పలికిన పూజారులు
Daggubati Purandeswari : భారతీయ జనతా పార్టీ ఏపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం విజయవాడలోని శ్రీ కనక దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ తో పాటు పూజారులు సాదర స్వాగతం పలికారు పురంధేశ్వరి దంపతులకు. అనంతరం పూజలు చేశారు అమ్మ వారికి. పురందేశ్వరికి అమ్మ వారి ప్రసాదాన్ని అందజేశారు.
ఇటీవలే పార్టీ హైకమాండ్ ప్రస్తుతం ఉన్న సోము వీర్రాజును మార్చింది. ఆయనను జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది. ఆయన స్థానంలో కొత్తగా దగ్గుబాటి పురందేశ్వరికి(Daggubati Purandeswari) పార్టీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించింది. తాజాగా పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
కేంద్రం రూ. 20,000 కోట్లు ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు కనీసం 30 శాతం కూడా ఖర్చు చేయలేదంటూ ఆరోపించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు పురందేశ్వరి. కార్యకర్తలు, నేతలు ఇక నుంచి కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీ ప్రత్యామ్నాయంగా ఎదగాలని పిలుపునిచ్చారు. త్వరలోనే కష్టపడి పని చేసే వారికి ప్రయారిటీ ఉంటుందన్నారు.
Also Read : Emmanuel Macron : నేస్తమా ఇద్దరి లోకం ఒకటే – మాక్రాన్